
మాడ్రిడ్: తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–4లో హ్యాట్రిక్ మెడల్స్ సాధించింది. బరిలోకి దిగిన మూడు విభాగాల్లో రెండు రజతాలు, ఓ కాంస్యంతో మెరిసింది. శనివారం జరిగిన విమెన్స్ కాంపౌండ్ టీమ్ ఫైనల్లో జ్యోతి–పర్ణీత్ కౌర్–ప్రీతికా ప్రదీప్‌తో కూడిన ఇండియా త్రయం 225–227తో చైనీస్ తైపీ చేతిలో ఓడి రెండో ప్లేస్‌తో సిల్వర్ సాధించింది.
ఇక మిక్స్‌డ్ టీమ్ బ్రాంజ్ ప్లే ఆఫ్స్‌లో టాప్‌సీడ్ జ్యోతి–రిషబ్ యాదవ్ 156–153తో పదోసీడ్ పావోలా కొరాడో–డగ్లస్ వ్లాడిమిర్ నొలాస్కో (ఎల్ సాల్వడార్)పై నెగ్గి కాంస్యాన్ని సొంతం చేసుకున్నారు. విమెన్స్ ఇండివిడ్యువల్ కాంపౌండ్ ఫైనల్లో జ్యోతి 147-–148తో ఎల్లా గిబ్సన్ (బ్రిటన్) చేతిలో ఓడి సిల్వర్‌తో సరిపెట్టుకుంది. సెమీస్‌లో జ్యోతి 144–143తో హన్ స్యుంగ్యోన్ (కొరియా)పై నెగ్గి ఫైనల్‌కు చేరింది. బ్రాంజ్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లో పర్ణీత్ కౌర్ 143–146తో హన్ చేతిలో ఓడి నాలుగో ప్లేస్‌తో సంతృప్తి పడింది.