రేవంత్ రెడ్డి, బండి సంజయ్ పిచ్చొళ్లు: కేటీఆర్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్  పిచ్చొళ్లు: కేటీఆర్

తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఇండియాలోని ఏ రాష్ట్రంలో అయినా ఉన్నాయా..? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. పొరుగు ఉన్న రాష్ట్రాల్లోని ప్రజలు, సర్పంచులు తెలంగాణలో కలుస్తామని ఎందుకంటున్నారని ప్రశ్నించారు. ఇక్కడి అభివృద్ధిని చూసే వారు తెలంగాణలో కలుస్తామని కోరుతున్నారని చెప్పారు. 

కాంగ్రెస్ ఏం చేసింది..? 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా కాంగ్రెస్ ఏం చేసిందని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. దేశాన్ని, రాష్ట్రాలను ఏలిన కాంగ్రెస్ ప్రజలకు మాత్రం చేసిందేమీ లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రపదేశ్ ను కాంగ్రెస్ పరిపాలించిన సమయంలో కరెంటు సమస్య తీవ్రంగా ఉండేదన్నారు. మళ్లీ ఆ పాత రోజులు వెనక్కి రావాలా..? దిక్కుమాలిన అసమర్థ పాలన కావాలా..? అని ప్రశ్నించారు. తెలంగాణ తీసుకువచ్చిన బీఆర్ఎస్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చిన ప్రజలు.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఈసారి ఒక్క అవకాశం ఇవ్వండని రేవంత్ రెడ్డి అడుక్కుంటున్నారని మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు.