మీరు ఫోన్​కి అడిక్ట్ అయ్యారా.. ఇక అంతే సంగతులు!

మీరు ఫోన్​కి అడిక్ట్ అయ్యారా.. ఇక అంతే సంగతులు!

మాట్లాడేటప్పుడు తడబడుతున్నారా? పిలిచిన వెంటనే పలకట్లేదా? అయితే జాగ్రత్త! ఈ సమస్యలకు కారణం ఎప్పుడూ చేతిలో పట్టుకుని ఉండే మీ సెల్​ఫోన్. అవును.. ఈ మధ్య చేసిన సర్వేలో ఫోన్​కి బానిసలైన వాళ్లలో స్పీచ్​, సౌండ్ డిజార్డర్స్ వస్తున్నాయని తెలిసింది. ఎక్కువగా 6 నుంచి 12 ఏండ్ల మధ్య వయసులో ఉన్న పిల్లల్లో 42 .4 శాతం ఉంటే అందులో మాట్లాడేటప్పుడు తడబడే వాళ్లు 20.7 శాతం ఉన్నారు. 

13 నుంచి 18 ఏండ్ల వాళ్లలో 31.1 శాతం ఉంటే, తడబడుతూ మాట్లాడలేని వాళ్లు17. శాతంగా ఉన్నారు. దీనికితోడు లాంగ్వేజ్ డిజార్డర్స్ కూడా ఉన్నాయి. అవి 0 నుంచి 5 ఏండ్ల లోపు వాళ్లలో 69 శాతం ఉంటే, టీనేజర్స్​లో 48.2 శాతంగా ఉంది. ఇక 26 నుంచి 60 ఏండ్ల మధ్య వయసు వాళ్లలో 8.7 శాతం వెస్టిబ్యులార్ డిజార్డర్ అంటే... బాడీని సరిగా బ్యాలెన్స్ చేయకలేని సమస్య ఉంటోందని తెలిసింది.  

ది ఇండియన్ స్పీచ్ అండ్ హియరింగ్ అసోసియేషన్ (ISHA), హెల్త్ పార్లమెంట్​ అండ్ ది ఇంటర్నేషనల్ పేషెంట్స్ యూనియన్ కలిసి కమ్యూనికేషన్ డిజార్డర్స్ పై ఇండియాలో ఇంటింటి​ సర్వే చేశాయి. ఆ సర్వేలో ప్రొఫెషనల్స్, స్టూడెంట్​ వలంటీర్స్​గా పనిచేశారు. ఇందులో ఢిల్లీ ఎన్​సిఆర్ ఏరియా10, 228 కుటుంబాల నుంచి 53,801 మంది వ్యక్తిగతంగా పాల్గొన్నారు. 

జమ్మూ కశ్మీర్ నుంచి 6 వేల మంది పార్టిసిపేట్ చేశారు. కశ్మీర్​లో 57.6 శాతం మంది ఆడవాళ్లు, 42 .4 శాతం మగవాళ్లు కమ్యూనికేషన్ డిజార్డర్స్​తో బాధపడుతున్నారని సర్వేలో తేలింది. అలాగే జమ్మూలో 66.4 శాతం ఆడవాళ్లు, 33.6 శాతం మగవాళ్లు దీని బారిన పడ్డారట. ఈ సర్వే మే నుంచి జులై వరకు జరిగింది.