జుట్టు ఊడిపోతుందని బాధపడుతున్నారా..? అయితే ఈ 5 ఆరోగ్య సమస్యలే కావొచ్చు..

జుట్టు ఊడిపోతుందని బాధపడుతున్నారా..? అయితే ఈ 5 ఆరోగ్య సమస్యలే కావొచ్చు..

జుట్టు రాలడం అనేది వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య. అయితే ఎక్కువగా దీనిని మనం వాడే షాంపో లేక హెయిర్ ఆయిల్ వల్ల అనుకోని జాగ్రత్త తీసుకోకుండా వదిలేస్తుంటాం. జుట్టు కొద్దిగా రాలితే పర్వాలేదు, కానీ ప్రతిరోజు, ప్రతిసారి అలాగే రాలిపోతుంటే అది ఆరోగ్య సమస్యల వల్ల కూడా కావచ్చు.  

మీ జుట్టు  మీ ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. అలాగే అనారోగ్య లక్షణాలు కనిపించకముందే జుట్టు రాలడం మొదలవుతుంది. అందుకే జుట్టు రాలడం పై ఎక్కువ జాగ్రత్త వహించాలి.  ప్రతిసారి లేదా ఎక్కువగా జుట్టు రాలడానికి కారణమయ్యే కొన్ని ఆరోగ్య సమస్యల గురించి మీకోసం... 

థైరాయిడ్ : థైరాయిడ్ గ్రంథి శరీర మెటబాలిజంను కంట్రోల్ చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉన్నా (హైపోథైరాయిడిజం) లేదా ఎక్కువగా ఉన్నా (హైపర్‌థైరాయిడిజం) జుట్టు రాలుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న వారిలో 33% మందిలో జుట్టు రాలడం కనిపిస్తుంది. అలాగే హైపర్‌థైరాయిడిజంతో బాధపడుతున్న వారిలో 50% మందిలో జుట్టు రాలడం చూడొచ్చు.

ఐరన్ లోపం (రక్తహీనత): శరీరంలో ఐరన్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది, దింతో అవి బలహీనపడతాయి. ఐరన్, విటమిన్ డి, జింక్, ప్రొటీన్ వంటి ముఖ్యమైన పోషకాల లోపం వల్ల కూడా జుట్టు రాలిపోతుంటుంది.  సరైన మంచి ఆహారం తీసుకోవడం లేదా డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్స్ వాడటం ద్వారా ఈ సమస్యకి చెక్ పెట్టొచ్చు.

►ALSO READ | Vastu tips: గణేష్ మండపాల ఫేసింగ్ ఎటు వైపు ఉండాలి..

హార్మోన్ల అసమతుల్యత (PCOS, మెనోపాజ్): మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత కూడా జుట్టు రాలడానికి  ఒక కారణం. ముఖ్యంగా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS),  మెనోపాజ్ (రుతువిరతి) సమయంలో ఎక్కువగా జుట్టు ఊడిపోతుంది. PCOS పరిస్థితిలో మహిళల్లో హార్మోన్లైన ఆండ్రోజెన్స్ స్థాయిలు పెరుగుతాయి. దింతో జుట్టు పల్చబడటం, ముఖ్యంగా తల పైభాగంలో జుట్టు పల్చపడుతుంది. మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది.  

ఆటో ఇమ్యూన్ వ్యాధులు: ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతున్న వారిలో రోగనిరోధక వ్యవస్థ కొన్ని సందర్భాల్లో పొరపాటున వెంట్రుకల కుదుళ్లపై దాడి చేస్తుంది. ఇది జుట్టు రాలిపోవడానికి దారితీస్తుంది. లూపస్ వంటి పరిస్థితులలో అలసట, కీళ్ల నొప్పులు లేదా చర్మ సమస్యలతో కూడా జుట్టు రాలిపోవచ్చు. 

పోషకాహార లోపాలు: మనిషి వెంట్రుకలు కెరాటిన్‌తో తయారవుతాయి, ఇదొక కఠినమైన ప్రోటీన్. ప్రతి స్ట్రాండ్ మూడు పొరలతో ఉంటుంది: క్యూటికల్ (బయటి పొర), కార్టెక్స్ (మధ్య పోర, బలాన్ని ఇంకా రంగును ఇస్తుంది), మెడుల్లా (లోపలి కోర్). వెంట్రుకలలో లిపిడ్లు, నీరు ఇంకా ట్రేస్ మినరల్స్ కూడా ఉంటాయి. అందువల్ల ప్రోటీన్, విటమిన్ డి, బి12 లేదా జింక్ లోపం వల్ల జుట్టు బలహీనపడుతుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం లేదా తీవ్రమైన  డైటింగ్ కూడా  జుట్టు అనారోగ్యంగా, ఎక్కువ రాలిపోవడానికి దారితీస్తుంది.