
వినాయకచవితి పండగకు పల్లెలు.. పట్టణాలు ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే నిర్వాహకులు మండపాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. గణేష్ మండపాల ఏర్పాటులో వాస్తు పద్దతిని పాటించాలని వాస్తు కన్సల్టెంట్ కాశీనాధుని శ్రీనివాస్ అంటున్నారు. గణేష్ మండపాల ఫేసింగ్ ఏ దిక్కులో ఉండాలో తెలుసుకుందాం. . .
ప్రశ్న: ప్రతిసారి గణేష్ మండపాన్ని మా గల్లీలో ఎవరింట్లో ఖాళీ ప్లేస్ ఎక్కువుంటే వాళ్లింట్లో ఏర్పాటు చేసేవాళ్లు. ఈ సారి గల్లీ చౌరస్తాలో పెట్టాలనుకుంటున్నాం. మండపాన్ని ఏ దిక్కులో పెట్టాలి?
జవాబు : మండపం ఏర్పాటుకు వాస్తు పాటిస్తేనే మంచిది. తూర్పు, ఉత్తరం దిక్కులకు ఫేసింగ్ ఉండేట్టు పెట్టుకోవాలని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ చెబుతున్నారు.
ప్రశ్న: మా ఇలవేల్లు దుర్గామాత విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించాలనుకుంటున్నాం. ఉత్తర ముఖంగా ఉన్న మా ఇంట్లో ఎటువైపు ప్రతిష్ఠిస్తే బాగుంటుంది.
జవాబు: పడమటి గోడకు విగ్రహాన్ని పెట్టి తూర్పు వైపు ఫేసింగ్ ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం అన్నివిధాల మంచిదని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ సూచిస్తున్నారు.