పంజాగుట్ట, వెలుగు: చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని ‘అరేయ్ ఆపండ్రా’ చిత్ర దర్శక నిర్మాత అశోక్ నిమ్మల కోరారు. కేవలం రూ. 35 లక్షల పరిమిత బడ్జెట్తో, ఎలాంటి అశ్లీలతకు తావులేకుండా పూర్తి హాస్యభరితంగా ‘అరేయ్ ఆపండ్రా’ తెరకెక్కించామన్నారు.
గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కిషోర్ దాస్, భద్రం, వినోద్ వంటి నటులతో ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా రూపొందించిన ఈ చిత్రం విడుదలై తెలంగాణ వ్యాప్తంగా 50 సెంటర్లలో ప్రదర్శితమవుతోందని తెలిపారు. చిన్న సినిమా అయినప్పటికీ ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నామన్నారు.
