
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై పోరాడుతామని తెలంగాణ విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ అన్నారు. జేఎల్ఎం పోస్టులను భర్తీ చేయాలని కోరారు. సంఘం రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘం నాయకత్వం మరింత పటిష్టంగా ఉండాలని చెప్పారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు నేనావత్ రాంబాబు నాయక్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు కమిషన్ అండగా ఉంటుందన్నారు.
ఉద్యోగుల నియామకాలు, బదిలీలు, ప్రమోషన్లలో అన్యాయం జరిగితే సహించబోమన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. సంఘం సెక్రటరీ జనరల్ గా బక్క దానయ్య, గౌరవ అధ్యక్షుడిగా మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాయకులు పి.శంకర్, రామస్వామి, రౌతు రమేశ్ తదితరులున్నారు.