Abhishek Bachchan: ప్రభాస్ 'ఫౌజీ'లో బాలీవుడ్ స్టార్.. కీలక పాత్రలో అభిషేక్ బచ్చన్ టాలీవుడ్ ఎంట్రీ?

Abhishek Bachchan: ప్రభాస్ 'ఫౌజీ'లో బాలీవుడ్ స్టార్.. కీలక పాత్రలో అభిషేక్ బచ్చన్ టాలీవుడ్ ఎంట్రీ?

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'ఫౌజీ' . పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను స్వాతంత్ర్యానికి ముందు కాలంలో సాగే ఒక ప్రత్యేకమైన ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే లేటెస్ట్ గా వచ్చిన ఒక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినీ వర్గాలతో పాటు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

అభిషేక్ బచ్చన్ తెలుగు ఎంట్రీ?

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఆయనను సంప్రదించారని దానిని ఒకే చెప్పినట్లు సమాచారం.  'ఫౌజీ'లో ఒక కీలక పాత్రకు అభిషేక్ బచ్చన్ కరెక్ట్ గా సరిపోతారు. ఆ పాత్రకు ఉన్న పాధాన్యతను ఆయన ఇష్టపడ్డారు. అయితే ప్రస్తుతం రెమ్యునరేషన్ పై వారితో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొనే అవకాశం  ఉందని సినీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
 
బాలీవుడ్ స్టార్ అభిషేక్ , ప్రభాస్ తో జతకట్టడంతో ఈ మూవీపై అంచానాలను మరింత పెంచేస్తోంది. హిందీలో ఈ మూవీకి మరింత కలిసివస్తోంది.  బాలీవుడ్‌లో ఆయన నటనకు మంచి పేరుంది. విమర్శకుల ప్రశంసలు పొందారు. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ తెలుగు సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. ఈ సినిమాలో ఇప్పటికే మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, రాజేష్ శర్మ, జయప్రద వంటి ప్రముఖ నటులు భాగమయ్యారు.  హీరోయిన్‌గా ఇమన్వీ ఈ సినిమాతో భారతీయ సినిమాలోకి అడుగుపెడుతున్నారు.

ప్రభాస్ షెడ్యూల్స్ బిజీ బిజీ

 మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రాల్లో ఇప్పటివరకు ఇదే అత్యంత భారీ బడ్జెట్ సినిమా అని తెలుస్తోంది.  ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా కాలంగా జరుగుతోంది. ప్రభాస్ 'రాజా సాబ్' సినిమాతో బిజీగా ఉండటం వల్ల, ఆయన కాల్‌షీట్స్ లభ్యతను బట్టి షూటింగ్ జరుగుతోంది. హను రాఘవపూడి తన సినిమాలకు విజువల్స్ పరంగా ఇచ్చే ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని, ఈ పీరియడ్ డ్రామా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్‌ నిర్మిస్తున్నారు. సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. 

'ఫౌజీ' తరువాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో 'స్పిరిట్', ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో 'సలార్ 2' సినిమాలు చేయడానికి ప్రభాస్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలు పాన్-ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో నిర్మితమవుతున్నాయి. ఈ సినిమాలతో పాటు 'ఫౌజీ' కూడా ప్రభాస్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తోందో చూడాలి..