మా సమస్యలు పట్టించుకోరా?..మత్తడిగూడ వాగుపై వంతెన నిర్మించండి..గిరిజనుల ఆవేదన

మా సమస్యలు పట్టించుకోరా?..మత్తడిగూడ వాగుపై వంతెన నిర్మించండి..గిరిజనుల ఆవేదన

వానొస్తే చాలు.. వాగు వస్తుంది.. వాగు వచ్చినప్పుడల్లా ఇబ్బంది అవుతుంది.. మాసమస్య తీర్చండి అని  ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు.. ఓ మనిషి చనిపోతే దహన సంస్కరాలు చేసేందుకు అవతలి వైపు వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడ్డాం.. వాగు తగ్గేవరకు అక్కడే ఉండాల్సి వచ్చింది.. దయచేసి ఇప్పటికైనా మా సమస్యను తీర్చండి అంటూ ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​ మండల మత్తడిగూడ నివాసితులు, గిరిజనులు అధికారులను ప్రజాప్రతినిధులను వేడుకొంటున్నారు. వివరాల్లోకి వెళితే.. 

ఇటీవల కురిసిన వర్షాలకు మత్తడిగూడ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.. బుధవారం (సెప్టెంబర్17) రాకపోకలు బంద్​అయ్యాయి.. గ్రామంలో ఓ మనిషి చనిపోగా అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం కూడా లేకుండా పోయింది. వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఊరిలోకి పోవాలంటే వాగు తగ్గేవరకు నిరీక్షించాల్సిందే. చేసేదేమి లేక గ్రామంలోని యువత సాయంలో అతికష్టం మీద వాగు తాటాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చాలాకాలంగా మత్తడిగూడ వాగు సమస్య ఉంది.. వర్షం వచ్చినప్పుడల్లా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోతున్నారు.. మత్తడిగూడ వాగుపై వంతెన నిర్మించండి.. అని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకన్నా పట్టించుకునే నాథుడే లేడంటూ మత్తడిగూడ గ్రామంలో నివసించే గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికేఐనా మా సమస్యను పరిష్కరించండి మహా ప్రభో అని వేడుకుంటున్నారు గిరిజనులు.