
ప్రజాసమస్యలపై ఫిర్యాదులు అందిన వెంటనే అధికారులు స్పందించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీవృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లాస్పత్రిని పరిశీలించిన ఎంపీ..సమస్యలు ఉన్నాయి.. పరిష్కరించడం అని ఫిర్యాదు చేస్తే ఎందుకు స్పందించడం లేదని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్షపై ఎంపీ గడ్డం వంశీవృష్ణ ఫైర్ అయ్యారు. అనంతరం జిల్లా ప్రధానాస్పత్రిలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కలెక్టర్ శ్రీహర్షతో ప్రారంభించిన ఎంపీ.. ప్రధానమంత్రి మాతృవందనం పథకం కింద ప్రసూతి ప్రయోజనాలను మహిళలకు వివరించారు.మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది.. మహిళలకు ప్రయోజనం చేకూర్చే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎంపీ.
పెద్దపల్లి జిల్లాస్పత్రికి అంబెలన్స్ కావాలని ఎంపీ దృష్టికి తీసుకెళ్లడంతో తప్పకుండా ఎంపీల్యాడ్ నిధుల ద్వారా అంబెలెన్స్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కొత్తగా నిర్మిస్తున్న ప్రధానాస్పత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ప్రజాసమస్యలపై సమాచారం అందిస్తే స్పందించడం లేదని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షపై ఫైర్ అయ్యారు ఎంపీ వంశీకృష్ణ. ప్రజాసమస్యలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే అధికారులు తక్షణమే స్పందించాలి.. అది బాధ్యతగా గుర్తించాలని సూచించారు.
అనంతరం పెద్దపల్లిలో జరిగిన విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ గడ్డంవంశీకృష్ణ. విశ్వకర్మ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎంపీ గడ్డం వంశీకృష్ణను శాలువాలతో ఘనంగా సన్మానించారు విశ్వకర్మలు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎంపీ వంశీకృష్ణ.. స్వర్ణకార భవనం అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తానని హామి ఇచ్చారు. గతంలో స్వర్ణకార సంఘం భవన నిర్మాణానికి మొదటగా నిధులు సమకూర్చింది కాకా వెంటకస్వామి అని అన్నారు. బులియన్ మార్కెట్ పై స్వర్ణకారుల నుంచి అందిన ఫిర్యాదుతో పార్లమెంటులో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటుకు పార్లమెంటులో ప్రస్తావిస్తానన్నారు ఎంపీ వంశీకృష్ణ.