2 గంటల్లో నామ రూపాల్లేకుండా కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్టాండ్ : బస్సులు నీళ్లల్లో తేలుతూ వెళ్లాయి..!

2 గంటల్లో నామ రూపాల్లేకుండా కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్టాండ్ : బస్సులు నీళ్లల్లో తేలుతూ వెళ్లాయి..!

నిన్నటి వరకు ఓ లెక్క.. ఇప్పుడు ఓ లెక్క ఉన్నట్లు ప్రకృతి తన విశ్వరూపం చూపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన క్లౌడ్ బరస్ట్ విధ్వంసాన్ని సృష్టించింది. 2 అంటే రెండు గంటల్లో ఆర్టీసీ బస్టాండ్ నామ రూపాల్లేకుండా కొట్టుకుపోయింది అంటే.. ఏ స్థాయిలో వర్షం పడిందో అర్థం చేసుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి జిల్లా ధరంపూర్ పట్టణంలో.. 2025, సెప్టెంబర్ 15వ తేదీ రాత్రి వర్ష బీభత్సం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ధరంపూర్ జిల్లా మండి పట్టణంలో 15వ తేదీ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో వర్షం మొదలైంది. చిన్నగా మొదలైన వాన.. ఆ తర్వాత కుండపోతగా మారింది. అర్థరాత్రి ఒంటి గంట సమయానికి ప్రళయంగా మారింది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ మొత్తం మునిగిపోయింది. ఏ రేంజ్ లో అంటే ఆర్టీసీ బస్టాండ్ లో పార్క్ చేసి ఉన్న బస్సులు నీళ్లల్లో నిండా మునిగిపోయాయి. ఆ తర్వాత వరద ప్రవాహానానికి బస్సులు అన్నీ కొట్టుకుపోయాయి. 

ALSO READ : బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం..

అంత పెద్ద బస్సులే కొట్టుకుపోతే ఇక కార్లు, జీపులు, బైక్స్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. నీళ్లల్లో కాగితపు బొమ్మల్లా కార్లు, బైక్స్ కొట్టుకుపోయాయి. పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో 15 అడుగుల ఎత్తులో వరద ప్రవహరించింది. దీనికి కారణం.. ధరంపూర్ పట్టణం నుంచి ప్రవహరిస్తున్న సోన్ ఖాడ్ నది. నది పరివాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కావటంతో.. ఊహించని విధంగా వరద పోటెత్తింది. ఈ నీళ్లు అంతా ధరంపూర్ పట్టణాన్ని ముంచెత్తాయి. ఆర్టీసీ బస్సులే కనిపించనంత ఎత్తుగా సిటీలో నీటి ప్రవాహం ఉండటంతో.. జనం ప్రాణ భయంతో వణికిపోయారు.

సెప్టెంబర్ 16వ తేదీ మంగళవారం ఉదయానికి వరద తగ్గటంతో ప్రళయ బీభత్సం బయటపడింది. ఆర్టీసీ బస్టాండ్ నామరూపాల్లేకుండా కొట్టుకుపోవటమే కాదు.. బస్టాండ్ కు చాలా దూరంలో బస్సులు కనిపించాయి. ఈ ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.