6x12x25 మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి ఫార్ములా తెలుసా..? దీంతో రూ.కోటి కూడబెట్టొచ్చు..

6x12x25 మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి ఫార్ములా తెలుసా..? దీంతో రూ.కోటి కూడబెట్టొచ్చు..

ఈ రోజుల్లో యువతకు ఎదురవుతున్న అతిపెద్ద సమస్య ఎంత సంపాదించిన డబ్బు పొదుపు చేయలేకపోవటం. నెలకు 30 వేల సంపాదించినా.. 3 లక్షలు సంపాదించినా సేవింగ్స్ విషయంలో మాత్రం ప్రజలు వెనకబడిపోతున్నారు. అయితే అనుకోని సందర్భాలను ఎదుర్కోవానిటి ఆర్థికంగా భద్రత కలిగి ఉండటానికి పొదుపు, పెట్టుబడులు చాలా అవసరం. మీరు సేవ్ చేసినప్పుడే ఆ డబ్బును పెట్టుబడిగా మార్చి భవిష్యత్తు కోసం మంచి కార్పస్ బిల్డ్ చేసుకోగలరు.

ముందుగా మీరు ప్రతి నెల చేసే ఖర్చులను గమనించాలి. స్ప్రెడ్‌షీట్‌లో కానీ, నోట్బుక్‌లో కానీ అన్ని ఖర్చులను నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని కిరాణా, రుణ EMI, వినోదం వంటి ఏ అవసరానికి ఎంత అవసరమో కేటాయించండి. దీంతో అవసరాన్ని మించి ఎక్కడ ఖర్చు చేస్తున్నారో స్పష్టంగా మీకు అర్థం అవుతుంది. సో వేస్ట్ ఖర్చులను తగ్గించుకుని ఆ మెుత్తాన్ని అదనపు పెట్టుబడుల్లోకి మళ్లించటానికి ప్రయత్నించండి. 

ALSO READ : Swiggy, Zomato యూజర్లకు డబుల్ షాక్.. ఫుడ్ డెలివరీపై జీఎస్టీ మోత..

ప్రతి నెల పొదుపు చేసుకున్న వాటిని పెట్టుబడిగా మార్చడానికి ఉత్తమ మార్గం మ్యూచువల్ ఫండ్ SIP. ఒక్కసారిగా పెద్ద మొత్తం డబ్బు పెట్టకుండా.. ప్రతినెలా ఒకే మొత్తం పెట్టుబడి చేయవచ్చు. దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్ SIPలు సగటున 12% వరకు వార్షిక రాబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకే స్థిరంగా పెట్టుబడులను కొనసాగించటం దీర్ఘకాలంలో పెద్ద కార్పస్ సృష్టికి దారితీస్తుంది. 

కోటి కూడబెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్6x12x25 పెట్టుబడి సూత్రం..
* కోటి రూపాయల నిధిని సృష్టించడానికి ఆర్థిక నిపుణులు సూచించే 6x12x25 ఫార్ములా అద్భుతమైనది.
* ఇందులో పెట్టుబడిదారులు ప్రతి నెలా రూ.6వేలు ఎస్ఐపీ రూపంలో పెట్టుబడిని కొనసాగించాలి.
* రూ.6వేలు ఎస్ఐపీని 25 ఏళ్ల పాటు ప్రతినెల క్రమం తప్పకుండా కొనసాగించాలి. 
* పెట్టుబడిపై సగటున 12% రాబడి ఇచ్చే మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టుబడి పెడితే కోటి సంపాదించటం సులువుగా మారుతుంది. 
* మెచూరిటీ సమయంలో అంటే 25 ఏళ్లు పూర్తైన తర్వాత మీరు రూ.కోటి 2లక్షల13వేల239 పొందుతారు. ఇందులో మీరు పెట్టిన అసలు మెుత్తం రూ.18 లక్షలు కాగా.. మిగతా రూ.84 లక్షలు లాభాల రూపంలో అందుకుంటారు. 
* అంటే ప్రతిరోజూ మీరు రూ.200 పొదుపు చేయగలితే మీరు కోటీశ్వరులుగా మారాలనే కలను చేరుకోవటం పెద్ద కష్టం కాదు. మీ పిల్లల భవిష్యత్తును కూడా మీరు ఈ ఫార్ములాతో మార్చేయెుచ్చు.