
నవగ్రహాల్లో శని భగవానుడికి చాలా ప్రాధాన్యత ఉంది. శని అంటే అందరూ భయపడుతుంటారు. కాని ప్రతి వ్యక్తి జీవితంలో శని గ్రహం మూడు పర్యాయములు సంచరిస్తాడని జ్యోతిష్య పండితులు అంటున్నారు. శని భగవానుడు చెడే కాదు.. మంచి కూడా చేస్తాడు. జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం... అధికారానికి .. కారకుడు శని భగవానుడేననిచెబుతుంటారు.
జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం... 20 సంవత్సరాల సమయంలో అంటే 27 నుంచి 30 సంవత్సరాల మధ్యకాలంలో శని గ్రహం పుట్టినప్పుడు ఉండే ప్రదేశానికి తిరిగి వస్తాడని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఇది జీవితంలో ముఖ్యమైన బాధ్యతలు యవ్వనం , పరివర్తన, వృద్దాప్యం దశల్లో పరిణితితో కూడిన మార్పులను సూచిస్తుంది.
శని గ్రహం తిరిగి పుట్టినప్పుడు (మెదటి సారి) ఉన్న స్థానానికి 27 నుంచి 30 సంవత్సరాల మధ్యకాలంలో వచ్చినప్పుడు.. కెరీర్.. ప్రతిష్టలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. కొన్ని సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. బాధ్యతలను పెంచే విధంగా ఉంటుంది. ఆసమయంలో ఒడిడుదకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. జ్యోతిష్య నిపుణులు సంప్రదించి పరిహారాలు చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
శనిగ్రహం రెండోసారి రిటర్న్ అయినప్పుడు 56 నుంచి 60 సంవత్సరాల వయస్సులో అనుకోకుండా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని బాధ్యతల నుంచి విముక్తి కలుగుతుంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటపడి... జీవితంలో అసంతృప్తిగా ఉన్న రంగాలలో లక్ష్యాన్ని చేధించాలని తాపత్రయపడుతుంటారు. అయితే ప్రతి విషయాన్ని ఎక్కువుగా ఆలోచిస్తుంటారు.ఆర్ధిక విషయాల్లో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది .
శనిగ్రహం జీవితంలో మూడోసారి 84 నుంచి 90 సంవత్సరాల మధ్యలో ఉండగా రిటర్న్ అవుతాడు. ఈ సమయంలో ఆధ్యాత్మికం వైపు నడిచేలా శని గ్రహం ప్రోత్సహిస్తాడు. అన్ని బాధ్యతలను వదిలించుకుంటారు. ఆరోగ్య సమస్యలు తీవ్రంగా వేధిస్తాయి. ప్రతి ఒక్కరి పట్ల అసహనం ప్రవర్తిస్తుంటారు. అందరూ తన దగ్గరే ఉండాలి భావిస్తుంటారు.
శని గ్రహం తిరిగి రావడం ఒక సవాలుతో కూడిన సమయమని పండితులుచెబుతున్నారు. శని గ్రహం రిటర్న్ అయినప్పుడు జీవితంలో అనుకోని మార్పులు సంభవిస్తాయి . ఈ మార్పులకు ఎవరూ బాధ్యులు కారని గుర్తించండి. శని గ్రహం తిరిగి రావడం మార్పును తెస్తుంది.