నాంపల్లి కోర్టులో షర్మిల రిమాండ్​పై కొనసాగుతోన్న వాదనలు 

నాంపల్లి కోర్టులో షర్మిల రిమాండ్​పై కొనసాగుతోన్న వాదనలు 

నాంపల్లి కోర్టులో వైఎస్​ షర్మిల రిమాండ్​ పై వాదనలు కొనసాగుతున్నాయి.శాంతి యుతంగా నిరసన తెలపడానికి వెళ్తే అక్రమంగా అరెస్ట్ చేశారని షర్మిల తరపు లాయర్లు విన్నవించారు.పోలీసులు అరెస్ట్​ చేసిన తీరును తప్పుబట్టారు. పోలీస్ విధులకు షర్మిల ఎక్కడా ఆటంకం కలిగించలేదన్నారు. గతంలో ఎమ్మెల్యే రాజాసింగ్ రిమాండ్​ను  న్యాయవాదులు ప్రస్తావించారు. రోడ్డుపై షర్మిల ,పార్టీ కార్యకర్తలతో న్యూసెన్సు క్రేయట్ చేశారని...ముందస్తుగా సహకరించాలి కోరామని అయినా వారు వినలేదన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారులపై షర్మిల దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఆమె పోలీస్ అధికారుల వస్తువులను  లాక్కొనే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ సమయం లో రిమాండ్ విధించకపోతే లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. 

SR నగర్ పోలీస్ స్టేషన్ లోనే షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అమీర్ పేట్ ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు వైద్యపరీక్షలు చేశారు. ఆమెను నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 41-A సీఆర్పీసీ కింద నోటీసులు అందించి రిమాండ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న షాపుల్ని క్లోజ్ చేయించారు పోలీసులు. 

మరోవైపు లోటస్​ పాండ్​ లో వైఎస్​ విజయమ్మ నిరాహార దీక్ష కొనసాగుతోంది. తన బిడ్డను చూసే హక్కు కూడా లేదా అని వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. కూతురిని చూడటానికి వెళ్తే పోలీసులకు వచ్చిన ఇబ్బందేంటని నిలదీశారు. షర్మిలను పరామర్శించేందుకు బయల్దేరిన విజయమ్మను లొటస్ పాండ్ దగ్గర పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తారా అని తెలిపారు.  షర్మిల ఇంటికొచ్చే వరకు దీక్ష చేస్తానని చెప్పారు.  అసలు  షర్మిల చేసిన  నేరమేంటని నిలదీశారు. పాదయాత్ర చేస్తే తప్పా? పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా? అని ప్రశ్నించారు. తాము  ప్రభుత్వాలు నడిపామని..? తమకు పోలీసులు కొత్తేమీకాదన్నారు.  నిరసన తెలిపితే షర్మిలను అరెస్ట్ చేస్తారా అని నిలదీశారు. పాదయాత్ర ముగిసే టైంలో ఇలా దాడులు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదని.. ప్రజల నుంచి షర్మిలను ఎవ్వరూ వేరు చెయ్యలేరన్నారు.