ముగిసిన  ‘ఏరీస్ ఫ్యూచరా ’

ముగిసిన  ‘ఏరీస్ ఫ్యూచరా ’

హైదరాబాద్, వెలుగు: ఏరీస్ ఆగ్రో లిమిటెడ్ తన  'ఏరీస్ ఫ్యూచరా 2026' సేల్స్‌‌‌‌, మార్కెటింగ్‌‌‌‌ లీడర్‌‌‌‌షిప్ డెవలప్‌‌‌‌మెంట్ ప్రోగ్రామ్‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌లో  విజయవంతంగా నిర్వహించింది. దక్షిణ భారతదేశం నలుమూలల నుంచి డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, కంపెనీ సిబ్బందితో కలిపి 600 మందికి పైగా ఇందులో పాల్గొన్నారు. సంస్థ సీఎండీ  రాహుల్ మిర్చందానీ, మేనేజర్‌‌‌‌‌‌‌‌ అర్మాన్ మిర్చందానీ, డైరెక్టర్‌‌‌‌‌‌‌‌  జె.పి. సుబ్రమణియన్ ఈ వేడుకలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందించారు.  

కంపెనీ తన సీఎస్‌‌‌‌ఆర్  బాధ్యతల్లో భాగంగా ఉద్యోగులు, రైతులు, సరఫరాదారుల పిల్లలకు 'అకడమిక్ ఎక్సలెన్స్ స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌ల'ను అందజేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 5 నుంచి 10వ తరగతి చదువుతూ, 2025–-26 విద్యాసంవత్సరంలో అత్యుత్తమ మార్కులు సాధించిన 8 మంది విద్యార్థులను ఎంపిక చేసి, మొత్తం రూ.47,500 స్కాలర్‌‌‌‌షిప్ రూపంలో ఇచ్చింది.