న్యూఢిల్లీ: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి.. షెన్ మాస్టర్స్‌లో ఐదో రౌండ్ గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. మంగళవారం చైనా గ్రాండ్ మాస్టర్ యాంగీ యూతో జరిగిన ఈ గేమ్‌ను 25 ఎత్తుల వద్ద డ్రాగా ముగించాడు. నల్ల పావులతో ఆడిన అర్జున్ మిడిల్ గేమ్‌లో వచ్చిన అవకాశాలను వృథా చేసుకున్నాడు. ఈ రౌండ్ తర్వాత అర్జున్ మూడున్నర పాయింట్లతో రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
మరోవైపు ప్రేగ్ మాస్టర్స్‌లో యంగ్ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ఆరో రౌండ్‌లో నొడిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలిచాడు. మరో గేమ్‌లో డి. గుకేశ్.. మాటెస్‌జు బార్టెట్ (పోలెండ్) చేతిలో ఓడాడు. ఈ రౌండ్ అనంతరం ప్రజ్ఞానంద మూడున్నర, గుకేశ్ రెండున్నర పాయింట్లతో కొనసాగుతున్నారు.
