తొలి ఇండియన్ గా అర్జున్‌‌ కొత్త చరిత్ర..

తొలి ఇండియన్ గా అర్జున్‌‌ కొత్త చరిత్ర..
  •     ఫ్రీ స్టయిల్‌‌ గ్రాండ్‌‌ స్లామ్‌‌ చెస్ టూర్‌‌లో సెమీఫైనల్‌‌ బెర్త్ సొంతం
  •     ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌‌గా తెలంగాణ కుర్రాడి రికార్డు

లాస్‌‌‌‌ వెగాస్‌‌‌‌: తెలంగాణ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ ఎరిగైసి అర్జున్‌‌‌‌.. ఫ్రీస్టయిల్‌‌‌‌ గ్రాండ్‌‌‌‌ స్లామ్‌‌‌‌ టూర్‌‌‌‌లో చరిత్ర సృష్టించాడు. గురువారం జరిగిన క్వార్టర్‌‌‌‌ఫైనల్లో అర్జున్‌‌‌‌ 1.5–0.5తో నొడిర్బెక్‌‌‌‌ అబ్దుసత్తారోవ్‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌)పై గెలిచి సెమీస్‌‌‌‌లోకి అడుగుపెట్టాడు. ఫలితంగా ఈ టోర్నీలో సెమీస్‌‌‌‌ చేరిన తొలి ఇండియన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌గా రికార్డులకెక్కాడు. రెండు గేమ్‌‌‌‌ల్లోనూ అర్జున్‌‌‌‌ క్లాసిక్‌‌‌‌ ఆటతో ఆకట్టుకున్నాడు. మొదట జరిగిన ర్యాపిడ్‌‌‌‌ గేమ్‌‌‌‌లో అద్భుతమైన ఎత్తులు వేసిన అర్జున్‌‌‌‌ ఈజీగా నెగ్గాడు. కానీ రెండో గేమ్‌‌‌‌లో తెల్లపావులతో ఆడిన అర్జున్‌‌‌‌ చివర్లో అనవసర తప్పిదాలతో డ్రా చేసుకున్నాడు.

 ఫలితంగా నొడిర్బెక్‌‌‌‌కు హాఫ్‌‌‌‌ పాయింట్‌‌‌‌ వదిలేసుకున్నాడు. మరో క్వార్టర్స్‌‌‌‌లో ఆర్‌‌‌‌. ప్రజ్ఞానంద 3–4తో ఫ్యాబియానో కరువాన (అమెరికా) చేతిలో ఓడాడు. ఇద్దరి మధ్య ఏడు గేమ్‌‌‌‌లు జరగ్గా ప్రజ్ఞా కేవలం మూడు సందర్భాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్నాడు. తొలి గేమ్‌‌‌‌లో నెగ్గిన ఇండియన్‌‌‌‌ స్టార్‌‌‌‌ వరుసగా ఐదు గేమ్‌‌‌‌ల్లో ఓడాడు. నిర్ణయాత్మక ఏడో గేమ్‌‌‌‌ను నెగ్గిన కరువాన సెమీస్‌‌‌‌కు అర్హత సాధించాడు. ఇతర మ్యాచ్‌‌‌‌ల్లో లెవోన్‌‌‌‌ అరోనియన్‌‌‌‌ (అమెరికా) 2.5–1.5తో హికరు నకమురా (అమెరికా)పై, హన్స్‌‌‌‌ మోక్‌‌‌‌ నీమాన్‌‌‌‌ (అమెరికా) 4–2తో జావోకిర్‌‌‌‌ సిండరోవ్‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌)పై గెలిచారు. లోయర్‌‌‌‌ బ్రాకెట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లో లినియర్‌‌‌‌ డొమ్నిగ్వేజ్‌‌‌‌ (అమెరికా) 1.5–0.5తో బిబిసార అస్సౌబుయేవా (కజకిస్తాన్‌‌‌‌)పై, మాగ్నస్‌‌‌‌ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌ (నార్వే) 2–0తో విదిత్‌‌‌‌ సంతోష్ గుజరాత్ (ఇండియా)పై, వెస్లీ సో (అమెరికా) 1.5–0.5తో సామ్యూల్ సెవియన్ (అమెరికా)పై, విన్సెంట్‌‌‌‌ కీమర్‌‌‌‌ (జర్మనీ) 2.5–1.5తో రాబ్సన్‌‌‌‌ రేపై నెగ్గారు. ఇక ప్రజ్ఞానంద మరో ఏడుగురితో కలిసి నాకౌట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లో
 తలపడనున్నాడు.