రాజస్థాన్‭పై సెంచరీతో చెలరేగిన అర్జున్ టెండుల్కర్

రాజస్థాన్‭పై సెంచరీతో చెలరేగిన అర్జున్ టెండుల్కర్

పూర్వోరిమ్‌‌‌‌‌‌‌‌‌‌ (గోవా): సరిగ్గా 34 ఏళ్ల కిందట సచిన్‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌ తన ఫస్ట్‌‌‌‌ క్లాస్‌‌‌‌ డెబ్యూ మ్యాచ్‌‌‌‌లో సెంచరీతో చెలరేగితే.. అతని కుమారుడు అర్జున్‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌ అదే సీన్‌‌‌‌ను మళ్లీ ఇప్పుడు రిపీట్‌‌‌‌ చేశాడు. గోవా తరపున తొలి రంజీ మ్యాచ్‌‌‌‌ ఆడుతున్న 23 ఏళ్ల అర్జున్‌‌‌‌ (207 బాల్స్‌‌‌‌లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 120).. రాజస్తాన్‌‌‌‌పై సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి గోవా తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 493/8 స్కోరు చేసింది. సుయాష్‌‌‌‌ ప్రభుదేశాయ్‌‌‌‌ (212) డబుల్‌‌‌‌ సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌‌‌‌కు 221 రన్స్‌‌‌‌ జోడించారు.

11 డిసెంబర్‌‌‌‌ 1988లో  సచిన్‌‌‌‌ 15 ఏళ్ల 232 రోజుల వయసులో బాంబే తరఫున బరిలోకి దిగి.. గుజరాత్‌‌‌‌పై సెంచరీ సాధించాడు. దీంతో ఫస్ట్‌‌‌‌ క్లాస్‌‌‌‌ డెబ్యూ మ్యాచ్‌‌‌‌లో సెంచరీ కొట్టిన యంగెస్ట్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌గా రికార్డు సృష్టించాడు.145 ఏళ్ల టెస్ట్‌‌‌‌ చరిత్రలో లాలా అమర్‌‌‌‌నాథ్‌‌‌‌, అతని కుమారుడు సురీందర్‌‌‌‌ అరంగేట్రం మ్యాచ్‌‌‌‌లో సెంచరీలు సాధించారు.