4 వికెట్లు పడగొట్టిన అర్జున్ టెండూల్కర్

4 వికెట్లు పడగొట్టిన అర్జున్ టెండూల్కర్

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అదరగొట్టాడు.  హైదరాబాద్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ బీ మ్యాచ్‌లో అర్జున్ బంతితో చెలరేగాడు. నాలుగు ఓవర్లలో 10 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక  ఓవర్ మెయిడిన్ వేయడంతో పాటు...మొత్తం 17 డాట్ బాల్స్ వేశాడు.  అర్జున్ బౌలింగ్‌లో హైదరాబాద్ బ్యాట్స్మన్ ఒకే ఒక బౌండరీ బాదారు. 

అర్జున్ టెండూల్కర్ బుల్లెట్ బంతులు..
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ను అర్జున్ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ ప్రతీక్‌రెడ్డిని క్యాచ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఒకే ఓవర్లో రాహుల్ బుద్ది, రవి తేజలను పెవీలియన్ చేర్చాడు. అనంతరం వైస్ కెప్టెన్ తిలక్ వర్మ బుట్టలో వేసుకున్నాడు. చివరకు హైదరాబాద్  20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. 

కెరీర్ బెస్ట్ బౌలింగ్..
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొట్టడం ద్వారా అర్జున్ టెండూల్కర్ కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. గతంలో ముంబైకి ఆడిన అర్జున్ టెండూల్కర్..పోటీ ఎక్కువ ఉండటంతో..గోవాకు మారాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు.  ఇదే ఫామ్‌ను  కొనసాగిస్తే మాత్రం..అర్జున్ వచ్చే ఏడాది ముంబై ఇండియన్స్  తరపున ఐపీఎల్ ఆడే ఛాన్సుంది. గత రెండేళ్లుగా అతను ముంబై జట్టులో సభ్యుడిగా ఉన్నా..తుది జట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు.