టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రజ్ఞాపై అర్జున్ గెలుపు

టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ప్రజ్ఞాపై అర్జున్ గెలుపు

వైక్ ఆన్ జీ (నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌): ప్రతిష్టాత్మక టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ శుభారంభం చేశాడు. టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగిన అర్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియాకే చెందిన  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ప్రజ్ఞానందపై  విజయం సాధించాడు.  

క్వీన్స్ గాంబిట్ తో మొదలైన ఈ పోరులో ప్రజ్ఞానంద మధ్యలో చిన్న పొరపాటు చేయడంతో అర్జున్ దానిని సద్వినియోగం చేసుకున్నాడు. కేవలం 32 ఎత్తుల్లోనే ప్రజ్ఞానంద ఓటమిని అంగీకరించాడు. వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డి. గుకేశ్.. ఉజ్బెకిస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సిందరోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 78 ఎత్తుల తర్వాత డ్రా చేసుకున్నాడు.  అరవింద్ చిదంబరం జర్మనీకి చెందిన మాథియాస్ బ్లూబామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య గేమ్ 41 ఎత్తుల్లో డ్రాగా ముగిసింది. అమెరికా ప్లేయర్ హన్స్ మోక్ నిమాన్ కేవలం 16 ఎత్తుల్లోనే  స్లోవేనియాకు చెందిన వ్లాదిమిర్ ఫెడోసీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సంచలన విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్... నెదర్లాండ్స్ స్టార్ ప్లేయర్ అనీష్ గిరిని ఓడించాడు.