ఫిడే గ్రాండ్‌‌‌‌‌‌‌‌ స్విస్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో అర్జున్‌‌‌‌‌‌‌‌కు రెండో విక్టరీ

ఫిడే గ్రాండ్‌‌‌‌‌‌‌‌ స్విస్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో అర్జున్‌‌‌‌‌‌‌‌కు రెండో విక్టరీ

ఐల్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ మ్యాన్‌‌‌‌‌‌‌‌ (యూకే): తెలంగాణ గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ ఎరిగైసి అర్జున్‌‌‌‌‌‌‌‌.. ఫిడే గ్రాండ్‌‌‌‌‌‌‌‌ స్విస్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించాడు.  శుక్రవారం జరిగిన రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లో అర్జున్‌‌‌‌‌‌‌‌ 40 ఎత్తుల వద్ద అంటోన్‌‌‌‌‌‌‌‌ గుయిజారో (స్పెయిన్‌‌‌‌‌‌‌‌)పై గెలిచాడు. మరో గేమ్‌‌‌‌‌‌‌‌లో తెలుగు గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ పెంటేల హరికృష్ణ.. అర్యన్‌‌‌‌‌‌‌‌ టారి (నార్వే) చేతిలో ఓడాడు. విమెన్స్‌‌‌‌‌‌‌‌లో ద్రోణవల్లి హారిక.. హోయాంగ్‌‌‌‌‌‌‌‌ తన్హా ట్రాంగ్‌‌‌‌‌‌‌‌ (హంగేరి)తో, ఆర్‌‌‌‌‌‌‌‌. వైశాలి.. ఎలినా రోయెబర్ట్‌‌‌‌‌‌‌‌ (నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌)తో జరిగిన గేమ్‌‌‌‌‌‌‌‌లను డ్రాగా ముగించారు.