పెళ్లి చేసుకోబోతున్న బుట్టబొమ్మ సింగర్.. అమ్మాయి ఎవరో తెలుసా?

పెళ్లి చేసుకోబోతున్న బుట్టబొమ్మ సింగర్.. అమ్మాయి ఎవరో తెలుసా?

బాలీవుడ్(Bollywood) స్టార్ సింగర్(Singer) అర్మాన్ మాలిక్ కు తెలుగు లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ముంబైకి చెందిన ఈ సింగర్.. బాలీవుడ్ తోపాటు తెలుగు, తమిళ్ సినిమాల్లో అనేక పాటలు పాడారు. ఇక రీసెంట్ సూపర్ హిట్ సినిమా ఆలా వైకుంఠపురంలో లో బుట్టబొమ్మ పాటతో ఫుల్ ఫెమస్ అయిపోయాడు ఈ యంగ్ సింగర్. 

అయితే తాజాగా సమాచారం ప్రకారం అర్మాన్ మాలిక్ కు తన రియల్ లైఫ్ బుట్టబొమ్మ దొరికేసిందట. ఆమె మరెవరో కాదు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, సోషల్ మీడియా సెలబ్రిటీ ఆష్నా. చాలాకాలంగా ప్రేమలో ఉన్న ఏ జంట ఈ మధ్యే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఆశ్నా ష్రాఫ్ ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గా ఉన్నారు. ఆమెకు ఫ్యాషన్, ఇంటీరియర్ డిజైనింగ్ కి సంబంధించిన కంపెనీలు కూడా ఉన్నాయి. ఇక అర్మాన్ మాలిక్, ఆశ్నా ష్రాఫ్ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ జంటకు అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.