మనీ హేస్ట్ తరహాలో బ్యాంకు దోపిడీ.. రూ.18 కోట్లు ఎత్తుకెళ్లిన దొంగలు

మనీ హేస్ట్ తరహాలో బ్యాంకు దోపిడీ.. రూ.18 కోట్లు ఎత్తుకెళ్లిన దొంగలు

మనీహేస్ట్.. ఈ వెబ్ సీరియల్ దొంగలకు మంచి మంచి ఐడియాలు ఇస్తుంది.. ఈ తరహా దోపిడీలు ఇటీవల పెరగటమే ఇందుకు నిదర్శనం.. మణిపూర్ రాష్ట్రంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన దోపిడీతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఇలాంటి తరహా  రాబరీ గతంలో ఎప్పుడూ జరగలేదని.. దోపిడీదారులు బరి తెగించారని ఈ ఘటన నిరూపిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంపాల్ కు 80 కిలోమీటర్ల దూరంలోని ఉఖ్రల్ జిల్లాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది. నవంబర్ 30వ తేదీ రాత్రి.. ప్రత్యేక దుస్తుల్లో.. ముసుగులు ధరించి.. అత్యాధునిక తుపాకులు, కత్తులతో కొంత మంది బ్యాంకులోకి వచ్చారు. వాళ్లందరూ మనీహేస్ట్ సీరియల్ లో ఉన్నటువంటి వేషదారణలో ఉన్నారు. వస్తూనే.. బ్యాంక్ సిబ్బంది తలకు తుపాకులు గురి పెట్టారు. అందరి చేతులు కట్టేశారు.. నోటికి ప్లాస్టర్లు వేశారు.. అందర్నీ తీసుకెళ్లి బాత్రూంలో పెట్టారు..

సాయంత్రం 5.40 గంటల సమయంలో బ్యాంకును లూటీ చేసిన దుండగులు..  తుపాకీతో బ్యాంక్ మేనేజర్‌ని బెదిరించి లాకర్ ను ఓపెన్ చేయించారు.  అనంతరం అందులో ఉన్న రూ. 18.85 కోట్లు దోచుకెళ్లారు. దీనిపైఉఖ్రుల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తున్నారు.   దోపిడీ దొంగలను పట్టుకునేందుకు భద్రతా బలగాలు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. దోపిడీ దొంగలు  బ్యాంకు వెనుక వైపు నుండి రంధ్రం చేసి ప్రవేశించారని పోలీసులు తెలిపారు.