ఆర్మూర్, వెలుగు : ఇటీవల విడుదలైన గ్రూప్ 3 ఫలితాల్లో ప్రతిభ కనబర్చి ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖలో సీనియర్ అకౌంటెంట్‌గా ఎంపికైన ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని విశాఖ కాలనీకి చెందిన అట్టిమల్ల బాలరాజును శుక్రవారం స్పౌస్ ఫోరం, నిజామాబాద్ ఆధ్వర్యంలో సన్మానించారు.
2005లో ఎస్‌జీటీ ఉపాధ్యాయుడిగా సేవలు ప్రారంభించిన బాలరాజు, గత ఇరవై ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమై గ్రూప్ 3 ఉద్యోగాన్ని సాధించాడు. ప్రస్తుతం మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. బాలరాజు దంపతులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
