
ఆర్మూర్, వెలుగు: గతంలో ఎంతో చూడముచ్చటగా కనిపించిన ఆర్మూర్ టౌన్‌లోని హౌజింగ్ బోర్డు అతిపెద్ద పార్క్ నేడు ప్రమాదకరంగా మారింది. నిర్వహణ లేకపోవడంతో వాకింగ్ టైల్స్ ఊడిపోయాయి.. జారుడు బల్ల, ఊయల, ఇతర ఆట సామగ్రి విరిగిపోయి ప్రమాదకరంగా మారాయి. ఈ పరిస్థితి తెలియని పిల్లలు జారుడు బల్లలపై ఆడుతూ గాయాలపాలవుతున్నారు.
పార్క్‌లోని దాదాపు అన్ని ఐటమ్స్ తప్పుపట్టి విరిగిపోయి, రేకులుపైకి తేలినా అధికారులు పట్టించుకోవడం లేదు. మూడు నెలల క్రితం పార్క్‌లో వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం పునాది తవ్వగా, కాలనీవాసులు అడ్డుకుని నిరసన తెలిపారు. తవ్విన గుంతలను మున్సిపల్ అధికారులు ఇప్పటికీ పూడ్చలేదు.