ఎమ్మెల్యే జీవన్​రెడ్డికి నిరసన సెగ.. కొండూరులో చాముండేశ్వరి ఆలయం వద్ద ప్రచారానికి యత్నం

ఎమ్మెల్యే జీవన్​రెడ్డికి నిరసన సెగ.. కొండూరులో చాముండేశ్వరి ఆలయం వద్ద ప్రచారానికి యత్నం

నందిపేట, వెలుగు: నిజామాబాద్​జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూరులో ఆర్మూర్​ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ప్రచారం నిర్వహించేందుకు ఎమ్మెల్యే శనివారం గ్రామానికి వచ్చారు. గ్రామ శివారులోని చాముండేశ్వరి ఆలయం వద్ద కుంకుమార్చణ కార్యక్రమం జరుగుతున్న విషయం తెలుసుకొని కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే అక్కడికి వెళ్లారు.

దీంతో ఆలయం వద్ద ప్రచారం చేయొద్దంటూ భవానీ మాలధారులు, గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. ఎమ్మెల్యే గో బ్యాక్​అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య కాసేపు తోపులాట జరిగింది. గొడవ పెద్దదవుతుండడంతో ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించకుండానే అమ్మవారిని మొక్కుకుని వెనుదిరిగారు. అనంతరం గ్రామానికి వచ్చి ప్రచారం చేశారు.