బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ ఆవరణలో శ్రమదానం

బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ ఆవరణలో శ్రమదానం

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ టౌన్ శాస్త్రీనగర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ ఆవరణలో ఆదివారం శ్రమదానం నిర్వహించారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ సిబ్బంది భాగస్వాములై సంస్థ సభ్యులతో కలిసి శ్రమదానంలో పాల్గొన్నారు. 

కలుపు మొక్కలను తొలగించి, చెత్తాచెదారాన్ని తీసివేసి, పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్, జేఈ అమర్‌కుమార్, సిబ్బంది ఫహీమొద్దీన్, మహమ్మద్ సలీమొద్దీన్, సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, ప్రశాంత్, వేదరాజ్ కుమార్, గణేశ్, మధుసూదన్, వంట నరేశ్, కుతాడి ఎల్లయ్య, వేణు, కృషివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.