
ఆర్మూర్, వెలుగు: చిన్నారుల ప్రతిభ వెలికి తీసేందుకు సమ్మర్ క్యాంపులు దోహదపడుతాయని ఆర్మూర్ ఎంఈవో పింజ రాజ గంగారం అన్నారు. ఆర్మూర్ మండల సమ్మర్ క్యాంప్ ను ఆదివారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ స్కూల్ లో ప్రారంభించి మాట్లాడారు. క్యాంప్ 15 రోజుల పాటు కొనసాగుతుందన్నారు.
డ్రాయింగ్, శాస్త్రీయ సంగీతం, డ్యాన్స్, ఎంబ్రాయిడరీ లలో శిక్షణ ఇస్తారన్నారు. తాగు నీటి వసతి, మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో క్యాంపు కో ఆర్డినేటర్ శ్రీనివాస్, రవీందర్, గోపాల్,అశోక్, సంతోష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.