రాజౌరిలో పేలని షెల్స్ లభ్యం

రాజౌరిలో పేలని షెల్స్ లభ్యం

శ్రీనగర్: జమ్మూ రాజౌరి జిల్లాలోని సివిలియన్ ఏరియాల్లో పేలని అనేక షెల్స్ ను ఆర్మీ అధికారులు కనుగొన్నారు.- పాకిస్తాన్ ఆర్మీ పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుందనడానికి ఇది నిదర్శనమని వారు తెలిపారు. సోమవారం మీడియాతో ఒక అధికారి మాట్లాడారు. ‘‘పాక్​ సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్టు పేర్కొంది. 

అయితే, ఆ దేశం ప్రయోగించిన షెల్స్ గ్రామాల మధ్యలో పడ్డాయి. జనావాసాల మధ్య షెల్స్ ను ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు’’ అని చెప్పారు. పహల్గాం అటాక్ కు ప్రతీకారంగా ఇండియా ‘ఆపరేషన్ సిందూర్’ ను చేపట్టింది. ప్రతిస్పందనగా నియంత్రణ రేఖ వెంట పాక్ షెల్స్ ను ప్రయోగించింది. ఈ కాల్పుల్లో పూంచ్ జిల్లాకు చెందిన 20 మంది సహా మొత్తం 27 మంది సాధారణ పౌరులు చనిపోయారు. మరో 50 మంది గాయపడ్డారు.