కాసేపట్లో గుర్రంగూడకు సీఎం కేసీఆర్.. సాయంత్రం సాయిచంద్ అంత్యక్రియలు

కాసేపట్లో గుర్రంగూడకు సీఎం కేసీఆర్..  సాయంత్రం సాయిచంద్ అంత్యక్రియలు

తెలంగాణ ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సాయిచంద్‌ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం (జూన్ 29న) మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు జరగనున్నాయి. సాయిచంద్ అంతిమయాత్ర తమ స్వగృహం గుర్రంగుడా నుండి ప్రారంభమై బీఎన్ రెడ్డి నగర్ లోని సాహెబ్ నగర్ వరకూ సాగనుంది. సాహెబ్ నగర్ స్మశాన వాటికలో సాయిచంద్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

సాయిచంద్‌ మృతిపై పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, గంగుల కమలాకర్‌ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు సంతాపం వ్యక్తం చేశారు. 

సాయి చంద్ మృతదేహానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి నివాళులర్పించారు. సాయిచంద్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

* సాయిచందు భౌతికయానికి  నివాళులర్పించి, కుటుంబ సభ్యులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఓదార్చారు.

* సాయిచంద్ పార్ధివదేహం చూసి కన్నీరుపెట్టుకున్న మంత్రి హరీష్

* సాయిచంద్ తో అనుబంధం గుర్తు చేసుకున్న విమలక్క, దేశపతి శ్రీనివాస్