
హైదరాబాద్, వెలుగు: ఫోన్ లో ఆర్డర్ చేస్తే నేరుగా ఇంటికే మామిడి పండ్లను డెలివరీ చేసేందుకు రాష్ట్ర ఉద్యాన శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మే 1 నుంచి ఆర్డర్‌పై మామిడి పండ్లను సరఫరా చేయనుంది. లాక్‌డౌన్ కారణంగా రైతుల నుంచి మామిడి పండ్లను నేరుగా వినియోగదారులకు చేర్చాలని ఉద్యాన శాఖ, ఉద్యాన అభివృద్ధి సంస్థ నిర్ణయించాయి. రైతుల తోటల నుంచే మామిడి కాయలను సేకరిస్తుంది. సహజ పద్ధతిలో మాగబెట్టి కార్టన్ బాక్స్‌ల్లో 5 కిలోల చొప్పున(12 నుంచి 15 కాయలు) ప్యాక్ చేసి పోస్టల్ డిపార్ట్‌మెంట్ పార్సిల్ సర్వీస్ ద్వారా సరఫరా చేయనుంది. 5 కిలోల బంగినపల్లి మామిడి పండ్ల బాక్స్ ధర రూ.350గా నిర్ణయించారు. ఎన్ని బాక్స్‌లు కావాలన్నా బుక్ చేసుకోవచ్చని, ఆర్డర్ ఇచ్చిన నాలుగైదు రోజుల్లో డెలివరీ అవుతాయని ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి చెప్పారు. 7997724925, 7997724944 నంబర్లకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేసి ఆర్డర్ చేయవచ్చన్నారు. 7997724925 నంబర్‌కు గూగుల్‌పే చేసి పూర్తి అడ్రస్, పిన్‌కోడ్ మెసేజ్ పంపి ఆర్డర్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ చేసే వారు ఆంధ్రాబ్యాంక్ గగన్ మహల్ బ్రాంచ్‌లో జమయ్యేలా అకౌంట్ నంబర్ 013910100083888, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఏఎన్‌డీబీ0000139కు మనీ పంపాల్సి ఉంటుంది.