- అవసరమైన చోట కొత్త ఘాట్ల నిర్మాణానికి నిర్ణయం
ఏటూరునాగారం, వెలుగు : వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లను ఆఫీసర్లు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ములుగు జిల్లా రామన్నగూడెం, ముల్లకట్ట గోదావరి తీరంలో గతంలో నిర్మించిన పుష్కరఘాట్లను గురువారం ఆర్డీవో వెంకటేశం, ఇరిగేషన్ ఆఫీసర్లు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గోదావరి ఎక్కువగా లోతు ఉన్న చోట ఇసుక బస్తాలు వేయాలని, మెట్లు కూలిపోయిన చోట రిపేర్లు చేయడంతో పాటు మరింత వెడల్పు చేసి, భక్తులకు సౌకర్యంగా ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు. పాత ఘాట్ల వరకు గోదావరి నీరు
చేరుకోలేకపోతే.. ప్రవాహం ఉండే చోట కొత్తగా ఘాట్లను నిర్మించాలని చెప్పారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం నిర్వహించి ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై చర్చించారు. రామన్నగూడెం సర్పంచ్ గద్దల నవీన్, సీఐ శ్రీనివాస్, డీటీ రాహుల్ పాల్గొన్నారు.
