
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలోని బస్ డిపో, జడ్పీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీసీల సంఘాల పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం బుధవారం కలకలం రేపింది. 20న రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన ఉండగా ‘75 ఏండ్లలో సీఎం చేయడానికి కాంగ్రెస్‌లో ఒక్క బీసీ నాయకుడు కూడా దొరకలేదా?
బీసీలను కరివేపాకులా వాడుకుంటారా?’ అని ఫ్లెక్సీలో రాసి ప్రదర్శించారు. కాగా ఈ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేయించారనేది తెలియరాలేదు. కాంగ్రెస్ నేతలు వాటిని తొలగించారు.