కళాకారుల్లో కొత్తవారికి అవకాశమివ్వడం లేదు

కళాకారుల్లో కొత్తవారికి అవకాశమివ్వడం లేదు

తెలంగాణ ఎక్సైజ్, టూరిస్టు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసి సమస్యలు చెప్పుకోవడానికి వస్తే.. మినిస్టర్ క్వార్టర్ వద్ద తమను అరెస్టు చేశారని కళాకారులు వాపోయారు. సాంస్కృత శాఖలో పాతవారినే కొనసాగిస్తున్నట్లు.. కొత్త వారికి అవకాశం ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అసలైన కళాకారులను గుర్తించి ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. 558 మంది పాత కళాకారులను మళ్లీ ఉద్యోగాలు ఇచ్చారని.. అందులో కొత్తగా 30 మందికి మాత్రమే ఇచ్చారన్నారు. కళాకారులను ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

ఎంతోమంది కళాకారులు కూడు, గూడు లేక ఇబ్బందులు పడుతున్నట్లు.. దీనస్థితిలో ఉన్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మరో 200 ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన 60 మంది కళాకారులను బంజారాహిల్స్ పీఎస్ కు తరలించారు. ఈ సందర్బంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పాటల ద్వారా వినిపించారు.