26 మంది బీజేపీ నేతలపై పోలీసులు కేసు నమోదు

26 మంది బీజేపీ నేతలపై పోలీసులు కేసు నమోదు

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడికి వెళ్లిన బీజేవైఎం నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 26 మంది కార్యకర్తలపై బంజారాహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. రాత్రే రిమాండ్ చేయాలని పోలీసులు ప్రయత్నించారు. పొ ద్దున 5  గంటలకు మెజిస్ట్రేట్ కు వీడియో కాల్ చేసి కేసు వివరాలు చెప్పి రిమాండ్ చేయాలని పోలీసులు కోరారు. దీంతో పోలీసులపై మెజిస్ట్రేట్ సీరియస్ అయ్యింది. పొద్దున 5 గంటలకే రిమాండ్ చేయడానికి అంత అర్జెంట్ ఏముందని మెజిస్ట్రేట్ ప్రశ్నించింది. కోర్ట్ టైం కే తీసుకురావాలని పోలీస్ లను ఆదేశించింది. అంతకుముందు బీజేవైఎం నేతలను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. డెడ్లీ వెపన్స్ తీసుకొచ్చారంటూ FIR కాపీలో ప్రస్తావించారు. నిరసన వ్యక్తం చేయడానికి వెళితే.. హత్యాయత్నం కేసు నమోదు చేస్తారా ? అని రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రశ్నించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  లిక్కర్ స్కాం కేసుపై రాష్ట్ర సర్కార్ విచారణ చేపట్టాలని బీజేవైఎం నేతలు డిమాండ్​ చేశారు.  బంజారాహిల్స్ రోడ్​ నంబర్​ 14లోని కవిత ఇంటి ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు యత్నించారు.  వీరిని పోలీసులు అడ్డుకోవటంతో అక్కడే రోడ్డుపై బైఠాయించారు.  వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు.  దీంతో బీజేవైఎం కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.ఎమ్మెల్సీ కవిత ఇంటి ఎదుట నిరసన తెలుపుతుంటే.. పోలీసులు తమ పట్ల దారుణంగా వ్యవహరించి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.