ఖాకీ ఉగ్రవాది అరెస్టు

ఖాకీ ఉగ్రవాది అరెస్టు

ఖాకీ ఉగ్రవాది డీఎస్పీ దవీందర్ సింగ్ ను అరెస్టు చేశారు జమ్మూకశ్మీర్ పోలీసులు. పార్లమెంట్ పై దాడి… ఉగ్రవాదులతో సంబంధాలపై  దర్యాప్తు చేపట్టారు. అంతేకాదు దవీందర్ సింగ్ కు ఇచ్చిన పోలీసు మెడల్ ను రద్దు చేస్తూ జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దవీందర్ సింగ్‌కు 2018లో జమ్మూకశ్మీర్ రాష్ట్ర అత్యున్నత అవార్డు “షేర్ ఏ కశ్మీర్” పోలీసు మెడల్‌ను ప్రదానం చేసింది. 2017వ సంవత్సరం ఆగస్టు 25వ తేదీన పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిని తిప్పికొట్టినందుకు దవీందర్ సింగ్‌కు షేర్ ఏ కశ్మీర్ పోలీసు మెడల్ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను కారులో తరలిస్తూ పట్టుబడటంతో అతనికి ఇచ్చిన పోలీసు మెడల్‌ను రద్దు చేసి తిరిగి తీసుకున్నట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు ప్రకటించారు.