సర్పంచ్ లను అరెస్ట్ చెయ్యడం అప్రజాస్వామికం: జీవన్ రెడ్డి

సర్పంచ్ లను అరెస్ట్ చెయ్యడం అప్రజాస్వామికం: జీవన్ రెడ్డి

జగిత్యాల:  జాయింట్ చెక్ పవర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన… సర్పంచ్ లకు మద్దతు పలికారు కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి. జగిత్యాలలో మంత్రి కొప్పుల ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛ్ హరిత మిషన్ అవగాహన సదస్సును బహిష్కరించి ఆందోళనకు దిగిన సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. అక్కడకు చేరుకున్న జీవన్ రెడ్డి సర్పంచ్ లతో మాట్లాడారు . సర్పంచ్ లో న్యాయమైన డిమాండ్ ను ప్రభుత్వం తీర్చాలన్నారు. వారి ఆందోళనకు ఆయన సంఘీభావం తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే సర్పంచుల హక్కులకు కత్తెర వేయడం సరికాదన్నారు జీవన్ రెడ్డి.

జిల్లా కలెక్టర్ శరత్..  స్వచ్ఛ్ హరిత మిషన్ అవగాహన సదస్సును అధికారుల కార్యక్రమంగా, ప్రజాప్రతినిధులను అగౌరవపరచే  విధంగా మాట్లాడితే ధర్నా చేసినందుకు అరెస్ట్ చెయ్యడం అప్రజాస్వామికమని అన్నారు. 73 వ సవరణ బిల్లును కలెక్టర్ లకు అధికారులు కట్టబెట్టడం హేయమైన  చర్యగా వ్యకపరచారు. దొడ్డిదారిన అధికార దుర్వినియోగం చేసి, నిధులు కాజేసి, పరోక్ష అవినీతికి పాల్పడిన ఘనత జిల్లా కలెక్టర్ డా శరత్ కె దక్కిందని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.