ఓ టీచర్ చేయాల్సిన పనేనా ఇది..చిన్నారి ప్రైవేట్ పార్ట్స్పై ఏం చేసిందో చూడండి

ఓ టీచర్ చేయాల్సిన పనేనా ఇది..చిన్నారి ప్రైవేట్ పార్ట్స్పై ఏం చేసిందో చూడండి

ముంబైలోని నల్లసోపారాలో షాకింగ్ ఘటన..స్కూల్లో 8ఏళ్ల విద్యార్థిపై టీచర్ అమానుష దాడి..విద్యార్థి ప్రైవేట్ పార్ట్స్లో కోలిన్ స్ప్రే చేసింది. ఈ దురదృష్టకర,అమానవీయ చర్య స్థానికుల్లో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రజలు,మీడియా ఈ ఘటనను ఖండిస్తూ సమాజంలో మరింత కఠినమైన చట్టాల అవసరాన్ని డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. 

జూలై 23న ఈ ఘటన జరిగింది. ముంబై సమీపంలోని నల్లసోపారాలో హోవార్డ్ ఇంగ్లీష్ స్కూల్‌కు చెందిన నిదా నిజాముద్దీన్ అనే ఉపాధ్యాయురాలు ఈ దారుణానికి పాల్పడింది. విద్యార్థినుంచి దుర్వాసన వస్తుందనే ఫిర్యాదు మేరకు 8 ఏళ్ల బాలుడి ప్రైవేట్ భాగంలో కాలిన్ స్ప్రే చేసింది. @unexplored_vasai అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఈ మొత్తం సంఘటనను షేర్ చేయడంతో వైరల్ అయింది. ఇంటర్నెట్‌లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.

ఈ సంఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికులు ఫిర్యాదు చేశారు. టీచర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర విద్యా శాఖ  దర్యాప్తులో టీచర్ విద్యార్థిపై అనుమానుష దాడికి పాల్పడినట్టు రుజువైంది. 

►ALSO READ | మాలేగావ్ పేలుళ్ల కేసులో ట్విస్ట్..ప్రజ్ఞా ఠాకూర్ సహా నిందితులందరూ నిర్దోషులే

ఈ ఘటనతో హోవార్డ్ ఇంగ్లీష్ స్కూల్ రాష్ట్ర విద్యా శాఖ దృష్టికి వచ్చింది. స్కూల్ ను వెంటనే మూసివేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ స్కూల్ పై గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆ స్కూల్ ఔరంగాబాద్ లోని వేరే స్కూల్ నుండి లీవింగ్ సర్టిఫికేట్ (LC) జారీ చేస్తోందని తేలడంతో హోవార్డ్ స్కూల్ రిజిస్ట్రేషన్ ,చట్టబద్ధత గురించి తీవ్రమైన ఆందోళనలు వెల్లువెత్తాయి. 

నెటిజన్ల ఏమంటున్నారంటే.. 

టీచర్ చర్యను నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. విద్యార్థి భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. "ఉపాధ్యాయులు ఎలా ఆలోచిస్తారో ,ప్రవర్తిస్తారో అతను అలా ఉంటే..వారు ఆ వృత్తిలో పనిచేసేందుకు అర్హులు కాదు"  అని ఓ నెటిజన్  రాశారు.

స్థానికుడైన ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఇలా వ్రాశాడు.. హోవార్డ్ స్కూల్ మా ప్రాంతంలో ఉంది.. అది ఒక నివాస భవనంలో నిర్వహిస్తున్నారు. దానిని పాఠశాలగా ఎలా గుర్తించారో తెల్వట్లేదు అని రాశారు.