పది నిమిషాల్లో తెచ్చి ఇస్తున్నారా..? మీకు అదే కనిపిస్తోంది.. కానీ.. రియాల్టీ ఏంటంటే..

పది నిమిషాల్లో తెచ్చి ఇస్తున్నారా..? మీకు అదే కనిపిస్తోంది.. కానీ.. రియాల్టీ ఏంటంటే..

హైదరాబాద్: GHMC పరిధిలో ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ స్టోర్స్, డెలివరీ పాయింట్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. జెప్టో, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్ స్టా మార్ట్, బిగ్ బాస్కెట్ల స్టోర్స్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని ఈ సోదాల్లో తేలిపోయింది. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే నాసిరకం వస్తువులు డెలివరీ చేస్తున్నారని జీహెచ్ఎంసీకి ఎక్కువగా కంప్లెయింట్స్ అందాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 27 స్టోర్స్లో తనిఖీలు చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు 36 శాంపిల్స్ సేకరించారు. టెస్ట్ కోసం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్కి శాంపిల్స్ పంపారు. స్టోర్స్లో ఈగలు, దోమలు తిరుగుతున్నట్లు గుర్తించారు. స్టోర్స్లో పని చేసే వారు ఎలాంటి ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించట్లేదని అధికారులు మీడియాకు తెలిపారు.

10 నిమిషాల్లో డెలివరీ చేయడం ప్రస్తుతం నయా ట్రెండ్‌గా మారింది. ఫుడ్‌ కావొచ్చు, గ్రోసరీ కావొచ్చు ఇన్ స్టంట్గా డెలీవరి చేస్తున్నాయి. అయితే.. ఈ తొందరలో పడి కస్టమర్లకు నాసి రకం సరుకులు డెలివరీ చేస్తున్నాయని ఈ- కంపెనీలపై విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. క్విక్ కామర్స్ అతిపెద్ద సెగ్మెంట్‌‌‌గా మారిపోయింది. ఈ సెక్టార్‌‌‌లో ఉన్న అవకాశాలను కంపెనీలు గుర్తించి సొమ్ము చేసుకుంటున్నాయి. వేగంగా డెలివరీ సర్వీస్‌‌‌లను అందిస్తూ ప్రజల కొనుగోలు విధానాలను మార్చేశాయి.

►ALSO READ | క్రెడిట్ కార్డు స్కాంలు ఇలా కూడా జరుగుతున్నాయా..? 20 నిమిషాల్లో రూ.9 లక్షలు మాయం.. బీ కేర్ ఫుల్ !

కిందటేడాది బ్లూ-కాలర్ రంగంలో గిగ్ జాబ్స్ లేదా ఫ్రీలాన్స్ అవకాశాలు 92శాతం పెరిగాయని బ్లూ, గ్రే-కాలర్ రిక్రూట్‌‌‌‌మెంట్ ప్లాట్‌‌‌‌ఫామ్ వర్క్‌‌‌‌ఇండియా రిపోర్ట్ పేర్కొంది. ఈ–-కామర్స్, ఫుడ్ డెలివరీ, రైడ్-హైలింగ్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లు వేగంగా విస్తరిస్తున్నాయని, ఇవి ఫ్లెక్సిబుల్, ఆన్ -డిమాండ్ లేబర్‌‌‌‌‌‌‌‌ (డిమాండ్ బట్టి పని)పై ఆధారపడుతున్నాయని తెలిపింది. “క్విక్ కామర్స్ లాంటివి కేవలం డిమాండ్ క్రియేట్ చేయలేదు, ఈ సెక్టార్‌‌ను నమ్మదగిన ఆదాయ వనరుగా మార్చాయి. చిన్న నగరాల్లోని చాలా మంది క్యాండిడేట్స్‌‌‌కు డెలివరీ జాబ్స్ ఇప్పుడు తాత్కాలిక రోల్స్ కాదు, ఇవి వాళ్లకు సరైన కెరీర్ ఛాయిస్‌‌లు మారిపోవడం గమనార్హం.