
మీరు క్రెడిట్ కార్డు వాడరు.. ఎక్కడా స్వైప్ చేయారు.. ఆన్ లైన్ షాపింగ్ కూడా చేయరు.. కానీ మీ కార్డులో డబ్బులు మాయం అవుతాయి. మీకు ఓటీపీ రాకుండా.. మీ పర్మిషన్ లేకుండా వెంట వెంటనే కార్డు ఖాళీ అయిపోతుంటుంది. ముందుగా చిన్న అమౌంట్ తో స్టార్ట్ చేసి.. రెండు మూడు ట్రాన్జాక్షన్ల తర్వాత పెద్ద మొత్తంలో మీకు తెలియకుండానే గుంజేయడం ఇప్పుడు కొత్త స్కాం. కోల్ కతాలో ఒక వ్యక్తి కార్డు నుంచి కేవలం 20 నిమిషాల్లో 9 లక్షల రూపాలయు మాయం చేయడంతో ఈ స్కాం బయటపడింది.
కోల్ కతాలోని సార్సునా కు చెందిన పంకజ్ కుమార్ కు రెండు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఉన్నట్లుండి తొమ్మిది లక్షలు వాడుకున్నట్లు మెసేజ్ రావడంతో షాక్ తిన్నాడు. ఓటీపీ కూడా రాకుండా ఇలా ఎలా అని.. వెంటనే కార్డులను బ్లాక్ చేయించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్విమ్-స్వాప్ స్కాం గా పేర్కొన్నారు. పర్సనల్ డాటాను లాగేసి.. ఇకామర్స్ సైట్ లో పెద్ద ఎత్తున పర్చేజ్ చేసినట్లు చేసి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకోవడమే ఈ స్కాం సీక్రెట్. ఫైనాన్షియల్ క్రైమ్ లో ఇది ఇప్పుడు గ్రోయింగ్ ట్రెండ్ గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కార్తీక్ సాబ్లే పేర్కొన్నారు. ఇది మొదటి కేసు కాదని.. కోల్ కతాలో ఇలాంటి కేసులు విరివిగా నమోదవుతున్నట్లు చెప్పారు.
స్విమ్ స్వాప్ స్కాం అంటే ఏంటి..?
స్విమ్ స్వాప్ స్కాం కాస్త విచిత్రంగా ఉంటుంది. దుండగులు మన సిమ్ నెంబర్ ను వాళ్ల సిమ్ కు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. దీంతో మన ఫోన్ ను వాళ్లు ఆపరేట్ చేస్తారు. ఫోన్ లో ఉన్న ఫైనాన్షియల్ సీక్రెట్స్, నెంబర్స్, ఓటీపీలను ఈజీగా తెలుసుకుంటారు. ఓటీపీ, ఎస్సెమ్మెస్, బ్యాంక్ పాస్ వర్డ్స్.. ఇలా అన్నింటిని నోట్ చేసుకుంటారు. ఇదంతా మనకు తెలియకుండానే జరిగిపోతుంటుంది. ఆ తర్వాత మన కార్డుల నుంచి మెల్లగా డబ్బులు లాగేసుకుంటుంటారు.
ఈ స్కాం నుంచి ఎలా కాపాడుకోవాలి ?
ఇలాంటి స్కాంలకు గురి కాకుండా ఉంటాలంటే ఓటీపీ, సీవీవీ, పిన్ నెంబర్లను ఎవరితో షేర్ చేసుకోకూడదు. బ్యాంకులు ఎప్పుడూ ఈ ఇన్ఫర్మేషన్ అడగవు. ఒకవేళ అలాంటి ఫోన్లు వస్తే వెంటనే కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి చెప్పాలి.
సిమ్ డీ యాక్టివేటెడ్, సర్వీస్ లాస్ట్ .. లాంటి మెసేజ్ లు వస్తే పట్టించుకోకుండా ఉండకండి. స్విమ్ స్వాప్ ప్రొటెక్షన్ సర్వీస్ అందించాలని నెట్వర్క్ ఆపరేటర్ కు ఫోన్ చేయాలి. సిమ్ పిన్ లేదా లాక్ ద్వారా కస్టమర్ కేర్ వాళ్లు సిమ్ ను సేవ్ చేస్తారు.
తెలియకుండా ఏవైనా ట్రాన్జాక్షన్స్ జరిగినట్లు తెలిస్తే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వండి. ఆన్ లైన్ పేమెంట్స్ కోసం వర్చువల్ కార్డ్స్ లేదా సెకండరీ కార్డులను వాడటం మంచింది. యాప్స్, డివైజ్ ను ప్రొటెక్ట్ చేసుకోవడం మంచిది. బ్యాంకుల నుంచి వస్తున్నట్లుగా చేసే ఫేక్ కాల్స్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే కస్టమర్ కేర్ లేదా బ్యాంకుకు కాల్ చేయాలి.