Kingdom: థియేటర్లలో దద్దరిల్లుతున్న 'కింగ్ డమ్'.. రామ్ చరణ్, మంచు విష్ణు విషెస్..

Kingdom: థియేటర్లలో దద్దరిల్లుతున్న 'కింగ్ డమ్'..  రామ్ చరణ్, మంచు విష్ణు విషెస్..

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) వరుస పరాజయాల తర్వాత వెండితెరపై పవర్ ఫుల్ పాత్రలో రీ ఎంట్రీ ఇచ్చారు.  ఆయన నటించిన 'కింగ్ డమ్' ( Kingdom )  ఈ రోజు ( జూలై 31, 2025 ) థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు ఉత్సాహంగా థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ గా నిలుస్తుందని  అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.  అటు రౌడీస్టార్ కమ్ బ్యాక్ అంటూ నినాదాలతో థియేటర్లు దద్దరిల్లితున్నాయి.

దర్శకుడిపై ప్రశంసల జల్లు.
'కింగ్ డమ్' సినిమాను చూసిన తర్వాత చరణ్ చిత్రబృందాన్ని రామ్ చరణ్ అభినందించారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరిపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు.  డియర్ గౌతమ్  నేను చూసిన బెస్ట్ సినిమాల్లో ఇదొకటి.  ఇలాంటి సినిమాలను  ప్రేక్షకులు మీ నుంచి మరిన్ని ఆస్వాదించడాలని కోరుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ .. అని రామ్ చరణ్  పేర్కొన్నారు. ఇది ఆయన చేతిరాతతో రాసిన సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

►ALSO READ | KINGDOM Review: ‘కింగ్ డమ్’ ఫుల్ రివ్యూ.. విజయ్‌ దేవరకొండకు హిట్ ఇచ్చిందా..?

సినిమాను థియేటర్ లోనే చూడండి.. 
మరో వైపు 'కింగ్ డమ్' సినిమాకు మంచి జరగాలని కోరుకుంటూ మంచు విష్ణు శుభాకాంక్షలు తెలిపారు. మై బ్రదర్ వంశీ ఆల్ ది బెస్ట్ . విజయ్ దేవరకొండ, సత్యదేవ్ కు బెస్ట్ విషెస్ అంటూ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.  సినిమా లవర్స్ ని మనస్సూర్తిగా కోరుతున్నాను.  సినిమాను థియేటర్స్ లోనే చూడండి.. సమీక్షకులపై  ఆధారపడకండి. ఈ ప్రమాదకరమై సమీక్షకుల సంస్కృతిని త్వరలోనే పరిష్కరిస్తాను  .  సినిమాను ప్రోత్సహించండి. హర హర మహదేవ్ అంటూ పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

ఈ సీజన్ ఎంతో అద్భుతంగా..
అటు నేచురల్ స్టార్ నాని ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.  సినిమా చుట్టూ జరిగే ప్రతిదాన్ని ఇష్టపడతారు. #Kingdom మన గౌతమ్, విజయ్,  వంశీల నుంచి వచ్చిన పర్సనల్ ప్రాజెక్టులా అనిపిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రతిదీ చాలా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. దుల్కర్, రానాలది.. #kantha టీజర్ అద్భుతంగా ఉంది. #AakasamLoOkaTara దృశ్యం అందంగా ఉంది . అదనంగా అంచనా వేయడానికి #War2 #Coolie  ఎదురు చూస్తున్నారు. మీరంతా ఈ సినిమాలను థియేటర్లలో ఎంజాయ్ చేసి ఈ సీజన్ లో బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సీజన్ అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. 

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో విజయ్ దేవరకొండ , భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.  సినిమా మంచి పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు ఉత్సాహం రెట్టింపు అయింది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబట్టుతుందో చూడాలి మరి.