KINGDOM X Review: ‘కింగ్‌డమ్’ ఓవర్సీస్ రివ్యూ.. విజయ్ దేవరకొండ సినిమాకు టాక్ ఎలా ఉందంటే?

KINGDOM X Review: ‘కింగ్‌డమ్’ ఓవర్సీస్ రివ్యూ.. విజయ్ దేవరకొండ సినిమాకు టాక్ ఎలా ఉందంటే?

విజయ్ దేవరకొండ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్‌డమ్’ (KINGDOM). ఇవాళ (జులై 31న) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మన తెలుగు రాష్ట్రాల్లో 7:30amకి మొదటి షో పడనుంది. ఈ క్రమంలో ఒకరోజు ముందే బుధవారం (జులై 30న) యూఎస్‌లో ప్రీమియర్స్ ప్రదర్శించారు. అక్కడ మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూస్ పంచుకున్నారు. కింగ్‌డమ్తో విజయ్ ఎలాంటి కంటెంట్తో వచ్చాడో రివ్యూలో తెలుసుకుందాం. 

అయితే, కింగ్‌డమ్ అడ్వాన్స్ బుకింగ్స్లో దుమ్మురేపింది. బుధవారం సాయంత్రం వరకు మూవీ టికెట్ ప్లాట్ఫామ్స్లో ఒకటైన బుక్ మై షోలో (BookMyShow) 2 లక్షల టిక్కెట్ల అమ్ముడయ్యాయి. ఓవర్సీస్లో సైతం 30వేళకి పైగా టికెట్స్ తెగాయి. ఇలా రిలీజ్కు ముందే కింగ్‌డమ్ తన సత్తా చాటింది. మరి విడుదలయ్యాక ఎలాంటి టాక్ సొంతం చేసుకుందో ఓ లుకేద్దాం. 

కింగ్‌డమ్ కథ:

సూర్య అలియాస్ సూరి కానిస్టేబుల్ (విజయ్ దేవరకొండ) చుట్టూ కథ తిరుగుతుంది. అతను ఒక అత్యవసర ఆపరేషన్ కోసం అండర్‌కవర్ స్పైగా మారాల్సి వస్తుంది. ఈ క్రమంలో శ్రీలంకకు వెళ్ళిన సూరి, అక్కడ ఒక క్రిమినల్, మాఫియా డాన్‌గా ఉన్న వ్యక్తి తన సొంత అన్నయ్య శివ (సత్యదేవ్) అని తెలుసుకుంటాడు.

శివ మాఫియాలో ఉన్నా.. రాబిన్‌హుడ్ లాగా ప్రజలకు సహాయం చేసే వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. అలాంటి శివ.. అసలు మాఫియా డాన్‌గా ఎలా మారాల్సి వచ్చింది? అన్నయ్యను చూశాక సూరి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? సూరి తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడా? లేదా తన సీక్రెట్ ఆపరేషన్ని లక్ష్యాన్ని చేర్చడా? అనేది ‘కింగ్‌డమ్’ కథ.

ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే:

కింగ్‌డమ్ సినిమాకు ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఫస్టాఫ్ అదిరిపోయిందని.. ఇంటర్వెల్ సీన్తో కథ మరింత హైప్ పెంచేలా ఉందని అంటున్నారు. సెకండాఫ్లో అన్నదమ్ముల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయని, క్లైమాక్స్తో సినిమా స్థాయి మరింత పెరిగిందని నెటిజన్లు తమ రివ్యూలు ఇస్తున్నారు. ముఖ్యంగా సినిమా ప్రొడక్షన్, టెక్నీకల్ వాల్యూస్ అద్భుతమని పోస్టులు పెడుతున్నారు.

ఓ నెటిజన్ తన రివ్యూ షేర్ చేశారు. 'కింగ్‌డమ్ సినిమా ఎమోషనల్ బ్లాక్‌బస్టర్. విజయ్ దేవరకొండ తన నటనతో అదరగొట్టాడు. డైరెక్టర్ గౌతమ్ లోతైన కథతో కింగ్‌డమ్ తెరకెక్కించాడు. అనిరుధ్ సంగీతం అద్భుతంగా ఉంది. తప్పక చూడాల్సిన సినిమా' ఇదని రివ్యూ ఇచ్చారు. 

కింగ్‌డమ్ అదిరిపోయే మాస్ యాక్షన్ థ్రిల్లర్. అద్భుతమైన స్టోరీ లైన్తో తెరకెక్కింది. విజయ్ దేవరకొండ మాస్ కమ్ బ్యాక్ ఇచ్చారు. తన కెరీర్లో అత్యుత్తమ నటన కనబరిచారు. అనిరుధ్ BGM సినిమాని పీక్ లెవల్లో తీసుకెళ్లింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ సినిమాకు ప్రధాన బలం' అని మరో నెటిజన్ రివ్యూ షేర్ చేశారు. 

ఓ నెటిజన్ తన రివ్యూ పంచుకున్నారు. 'కింగ్‌డమ్ ఒక యాక్షన్ డ్రామా. ఈ మూవీ టెక్నీకల్గా చాలా బలంగా ఉంది. ఎమోషనల్ డ్రామా పరంగా ఆడియన్స్కి మంచి ఫీల్ ఇస్తుంది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఫస్టాఫ్లో ఎంచుకున్న స్టోరీతో సక్సెస్ అయ్యాడు. కథనం కొన్నిసార్లు ఫ్లాట్‌గా అనిపించినప్పటికీ, అది ఎక్కడ మెయిన్ స్టోరీ నుండి తప్పుకోదు. అద్భుతంగా సాగుతుంది. 

కింగ్‌డమ్ అద్భుతమైన టెక్నీకల్ టీమ్తో తెరకెక్కింది. సినిమాకు అదే ప్రధాన బలంగా నిలిచింది. సినిమా క్వాలిటీ మరియు నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. విజువల్స్ అత్యున్నత స్థాయిలో ఉండటం సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టారు.

ముఖ్యంగా విజయ్ దేవరకొండ అద్భుతమైన నటనను కనబరిచారు. అతని సినిమా కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనలలో సూరి క్యారెక్టర్ నిలిచిపోతుంది. ఓవరాల్గా కింగ్‌డమ్ఎమోషనల్ డ్రామా, బలమైన సాంకేతిక విలువలు మరియు బెస్ట్ పెర్ఫార్మన్స్.. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా' అని నెటిజన్ తన రివ్యూ పంచుకున్నారు.