Gold Rate: ట్రంప్ టారిఫ్స్ ప్రకటనతో తగ్గిన గోల్డ్ & సిల్వర్.. హైదరాబాదులో రేట్లిలా..

Gold Rate: ట్రంప్ టారిఫ్స్ ప్రకటనతో తగ్గిన గోల్డ్ & సిల్వర్.. హైదరాబాదులో రేట్లిలా..

Gold Price Today: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 1 నుంచి భారతదేశంపై 25 శాతం సుంకాలు అమలవుతాయని తేల్చి చెప్పేశారు. రష్యాతో స్నేహంపై ట్రంప్ సీరియస్ గా ఉండటంతో టారిఫ్స్ భయాలు ఉన్నప్పటికీ గోల్డ్ రేట్లు తగ్గటం గమనార్హం. ఈ క్రమంలో రేటు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు గోల్డ్ అండ్ సిల్వర్ కొనుగోళ్లకు మంచి సమయంగా వారు చెబుతున్నారు. 

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.4వేల భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 170, ముంబైలో రూ.9వేల 170, దిల్లీలో రూ.9వేల 185, కలకత్తాలో రూ.9వేల 170, బెంగళూరులో రూ.9వేల 170, కేరళలో రూ.9వేల 170, పూణేలో రూ.9వేల 170, వడోదరలో రూ.9వేల 175, జైపూరులో రూ.9వేల 185, లక్నోలో రూ.9వేల 185, మంగళూరులో రూ.9వేల 170, నాశిక్ లో రూ.9వేల 173, మైసూరులో రూ.9వేల 170, అయోధ్యలో రూ.9వేల 185, బళ్లారిలో రూ.9వేల 170, గురుగ్రాములో రూ.9వేల 185, నోయిడాలో రూ.9వేల 185గా ఉన్నాయి. 

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.4వేల 500 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ రేట్లను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10వేల 003, ముంబైలో రూ.10వేల 003, దిల్లీలో రూ.10వేల 018, కలకత్తాలో రూ.10వేల 003, బెంగళూరులో రూ.10వేల 003, కేరళలో రూ.10వేల 003, పూణేలో రూ.10వేల 003, వడోదరలో రూ.10వేల 008, జైపూరులో రూ.10వేల 018, లక్నోలో రూ.10వేల 018, మంగళూరులో రూ.10వేల 003, నాశిక్ లో రూ.10వేల 006, మైసూరులో రూ.10వేల 003, అయోధ్యలో రూ.10వేల 018, బళ్లారిలో రూ.10వేల 003, గురుగ్రాములో రూ.10వేల 018, నోయిడాలో రూ.10వేల 018 వద్ద కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.91వేల 700 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.లక్ష 30గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.2వేలు తగ్గి రూ.లక్ష 25వేల వద్ద ఉంది.