ORR నుంచి ఫోర్త్ సిటీకి స్పీడ్ గా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు..ప్రత్యేకతలు ఇవే..

ORR నుంచి  ఫోర్త్ సిటీకి  స్పీడ్ గా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు..ప్రత్యేకతలు ఇవే..
  • ఓఆర్​ఆర్​​ నుంచి ఫోర్త్ సిటీని అనుసంధానం చేస్తూ నిర్మాణం
  • రూ. 4,621 కోట్లతో రెండు ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో పనులు
  • 6 లేన్ల ప్రధాన క్యారేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే.. 8 లేన్ల విస్తరణకు అవకాశం

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్, సిటీ చుట్టూ ఉన్న ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు (రతన్ టాటా రోడ్డు) నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఔటర్​రింగ్​ రోడ్డు (ఓఆర్ఆర్)​ నుంచి ఫోర్త్ సిటీని కలుపుతూ నిర్మించతలపెట్టిన ఈ రహదారి.. ప్రస్తుత నాగార్జునసాగర్ హైవే (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్​19),  శ్రీశైలం హైవే (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్​765) లపై పెరుగుతున్న రద్దీ , ప్రమాదాలను తగ్గించడంలో సహాయ పడుతుందని ప్రభుత్వం ప్రకటించింది.  

ప్రయాణికుల భద్రత, ప్రస్తుత, భవిష్యత్ రవాణా అవసరాలను తీర్చడానికి ఈ కొత్త గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ రోడ్డు అత్యవసరమని పేర్కొన్నది.  ఈ రహదారి భవిష్యత్తులో పారిశ్రామిక, వాణిజ్య  ఆర్థిక అభివృద్ధి కోసం నిర్దేశించిన భారత్​ ఫ్యూచర్​ సిటీకి అనుసంధానంగా ఉంటుంది.  

పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్స్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఐటీ పార్కులు,  నివాస టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతోపాటు ప్రతిపాదిత స్కిల్ యూనివర్సిటీకి  అనుసంధానిస్తుంది. శంషాబాద్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు రావిర్యాల్ గుండా ప్రణాళికాబద్ధమైన మెట్రో ఫేజ్ 2బీ, రేడియల్ రోడ్డు నంబర్​1ని అనుసరిస్తుంది. రోడ్డు, మెట్రో  రెండింటిని ముందుగానే సమన్వయం చేయడం వల్ల భవిష్యత్తులో భూసేకరణ సమస్యలను నివారించేలా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.

  • గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు ప్రత్యేకతలు..పొడవు: 41.50 కిలో మీటర్లు


ఫేజ్ –I 

  • ఓఆర్​ఆర్​–రావిర్యాల్ నుంచి మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్ వరకు: 19.20 కిలో మీటర్లు
  • నిర్మాణ వ్యయం: రూ. 1,665 కోట్లు
  • భూసేకరణ ఖర్చు: రూ. 246 కోట్లు
  • ఇప్పటికే పరిపాలన అనుమతులు ఇచ్చారు.

ఫేజ్ – II 

  •     మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్ నుంచి ట్రిపుల్​ ఆర్–అమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గల్​ వరకు): 22.30 కిలో మీటర్లు
  •     నిర్మాణ వ్యయం : రూ. 2,365 కోట్లు
  •     భూసేకరణ ఖర్చు:  రూ. 345 కోట్లు
  •     పరిపాలనా అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు 
  • మొత్తం వ్యయం: నిర్మాణానికి రూ. 4,030 కోట్లు, భూసేకరణకు రూ. 591 కోట్లు 
  • ఆర్ వోడబ్ల్యూ వెడల్పు: 100 మీటర్లు (పాక్షికంగా యాక్సెస్ నియంత్రిత ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే) 
  • లేన్లు: 3+3 ఆరు-లేన్ల ప్రధాన క్యారేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే, భవిష్యత్తులో 4+4 ఎనిమిది లేన్ల విస్తరణకు అవకాశం 
  • మెట్రో/రైల్వే కారిడార్: మధ్యలో 20 మీటర్ల భూమి వెడల్పు మెట్రో/రైల్వే కారిడార్ కోసం రిజర్వ్, 2+2 మీటర్ల పచ్చదనం

ఇతర సదుపాయాలు:

  •  3 లేన్ల సర్వీస్ రోడ్లు, 2 మీటర్ల వెడల్పు గ్రీన్ బెల్ట్, 3 మీటర్ల వెడల్పు సైకిల్ ట్రాక్, 2 మీటర్ల వెడల్పు ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాత్, 2 మీటర్ల వెడల్పు యుటిలిటీ కారిడార్స్​ 
  • భూసేకరణ వివరాలు: మొత్తం అవసరమైన భూమి 1,003.61 ఎకరాలు
  • ఇందులో టీజీఐఐసీ భూములు 202 ఎకరాలు, అటవీ భూమి 231.72 ఎకరాలు