మహిళను కొట్టిన టీఆర్ఎస్ కార్పొరేటర్​ను అరెస్ట్​ చెయ్యాలె

మహిళను కొట్టిన టీఆర్ఎస్ కార్పొరేటర్​ను అరెస్ట్​ చెయ్యాలె

జీడిమెట్ల, వెలుగు: బీజేపీ మహిళా కార్యకర్తపై దాడిచేసిన జగద్గిరిగుట్ట కార్పొరేటర్ ​జగన్​, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్​ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేశారు. దీంతో జగద్గిరిగుట్ట పోలీస్​స్టేషన్​ ముందు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. వారిని అరెస్టు చేసి సనత్​నగర్​ పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ  టీఆర్​ఎస్​  నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. కార్పొరేటర్ ​జగన్​ అతని అనుచరులు మహిళపై భౌతిక దాడి చేయడం హేయమైన చర్య అని  ఖండించారు. టీఆర్​ఎస్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో  మేడ్చల్​ జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరీష్​ రెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంఎస్​ వాసు, హనుమంతరెడ్డి, భరత్​ సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

For More News..

ఎండు మిర్చికి ఫుల్ డిమాండ్.. క్వింటాల్‌కు రూ. 20,500

రైతులు అమ్ముకున్నంక.. రేటు పెంచిన్రు.. రూ. 2500 నుంచి 5900కి పెంపు

స్కూల్ వంటమనిషికి పద్మశ్రీ అవార్డ్