
జంతువుల కళేబరాలతో నూనె తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ పంచాయతీ, రైల్వే స్టేషన్ సమీపంలోని హరి ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కెడియా) పరిశ్రమలో కొందరు వ్యాపారులు జంతు కళేబరాలను, చనిపోయిన పందులు వాటి కళేబరాలతో కల్తీ నూనె తయారు చేస్తున్నారు. స్థానికులు సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు , పోలీసులు పరిశ్రమను తనిఖీ చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పరిశ్రమను సీజ్ చేశారు. అదుపులోకి తీసుకున్న వారిని విచారిస్తున్నారు.