‘ఎట్ రిస్క్’ కంట్రీస్ నుంచొస్తే.. టెస్ట్ తప్పనిసరి

‘ఎట్ రిస్క్’ కంట్రీస్ నుంచొస్తే.. టెస్ట్ తప్పనిసరి
  • కరోనా టెస్ట్​ రిజల్ట్​ కోసం ప్రయాణికులు వెయిటింగ్​
  • రిజల్ట్ వచ్చేదాకా గంటల తరబడి వెయిట్ చేయాల్సిందే
  • ఆర్టీ పీసీఆర్ టెస్టుకు 500.. ఐదారు గంటల్లో రిజల్ట్ 
  • ర్యాపిడ్ పీసీఆర్ టెస్టుకు 4000.. గంటలోనే రిజల్ట్

న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రోజుకో దేశానికి పాకుతుండటంతో మన దేశంలోకి ఫ్లైట్లలో వచ్చేటోళ్లకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త గైడ్ లైన్స్ మంగళవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. ఫ్లైట్ దిగంగనే టెస్ట్ తప్పనిసరి చేయడం, రిజల్ట్ వచ్చేదాకా ఎయిర్ పోర్టులోనే ఉండాల్సి రావడంతో ఢిల్లీ, ముంబై, చెన్నై ఎయిర్ పోర్టుల్లో విదేశాల నుంచి వచ్చినోళ్లు ఐదారు గంటలకు పైగా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ‘ఎట్ రిస్క్’ లిస్టులో ఉన్న దేశాల నుంచి వచ్చేటోళ్లలో ప్రతి ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ లేదా ర్యాపిడ్ పీసీఆర్ టెస్టును తప్పనిసరి చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చేటోళ్లలో మాత్రం ర్యాండమ్ గా 2% మందికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. అయితే ముంబై ఎయిర్ పోర్టులో మాత్రం రూల్స్ మరింత స్ట్రిక్ట్ చేశారు. విదేశాల నుంచి వచ్చినోళ్లు అందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టును తప్పనిసరిగా చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, బ్రిటన్, యూరప్ కంట్రీస్, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, బోట్స్ వానా, చైనా, మారిషస్, న్యూజీలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్ దేశాలను కేంద్రం ‘ఎట్ రిస్క్’ 
దేశాల లిస్టులో చేర్చింది. 

రెండింట్లో ఏ టెస్ట్ అయినా.. 
కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న ‘ఎట్ రిస్క్’ దేశాల నుంచి వచ్చేటోళ్లలో ప్రతి ఒక్కరికీ కరోనా టెస్ట్ చేయాలని, ఇతర దేశాల నుంచి వచ్చేటోళ్లలో కొంతమందికి ర్యాండమ్ గా టెస్ట్ చేస్తే సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం తన గైడ్ లైన్స్ లో స్పష్టం చేసింది. ప్యాసింజర్లు ఆర్టీపీసీఆర్ లేదా ర్యాపిడ్ పీసీఆర్ టెస్టుల్లో ఏదైనా ఒకదానిని సెలక్ట్ చేసుకోవచ్చని తెలిపింది. వీరంతా టెస్టుల రిజల్ట్ వచ్చేదాకా ఎయిర్ పోర్టులోనే ఉండాలని, నెగెటివ్ వచ్చినా 7 రోజులు హోం క్వారంటైన్ తప్పనిసరి అని పేర్కొంది. దీంతో బుధవారం ఆయా దేశాల నుంచి ఫ్లైట్లలో దిగిన ప్యాసింజర్లతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో భారీ క్యూలు కనిపించాయి. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆర్టీపీసీఆర్ కు రూ. 500, ర్యాపిడ్ పీసీఆర్ కు రూ. 4000 వసూలు చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టు చేసుకుంటే రిజల్ట్ వచ్చేందుకు ఐదారు గంటలు, ర్యాపిడ్ పీసీఆర్ చేసుకుంటే గంటలోపే టైం పడ్తుండటంతో 90 శాతం మంది ర్యాపిడ్ పీసీఆర్ టెస్టుకే మొగ్గు చూపారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో బుధవారం ఉదయంకల్లా 1013 మంది ప్యాసింజర్లు అరైవల్ ఫార్మాలిటీలు పూర్తి చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. 

మహారాష్ట్రలో గైడ్ లైన్స్ మార్చాలె: కేంద్రం 
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చేటోళ్లకు కేంద్రం జారీ చేసిన గైడ్ లైన్స్.. మహారాష్ట్ర సర్కారు ఇచ్చిన గైడ్ లైన్స్ వేర్వేరుగా ఉన్నాయని, రాష్ట్రం తన గైడ్ లైన్స్ ను సవరించాలని బుధవారం కేంద్ర హెల్త్ మినిస్ట్రీ సూచించింది. అన్ని రాష్ట్రాలు, యూటీల్లో  రూల్స్ ను ఒకేలా అమలు చేయాలని కోరింది. కేంద్రం ఆదేశాల ప్రకారం.. రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చేటోళ్లందరికీ ఎయిర్ పోర్టుల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలి. ఇతర దేశాల నుంచి వచ్చేటోళ్లలో 5 శాతం మందికి ర్యాండమ్ గా టెస్టులు చేయాలి. రిస్క్ కంట్రీస్ వాళ్లు 7 రోజులు హోం క్వారంటైన్ లో ఉండాలి. మిగత దేశాల నుంచి వచ్చేవాళ్లు 14 రోజుల పాటు తమ ఆరోగ్యాన్ని మానిటర్ చేసుకోవాలి. అయితే, రిస్క్ లిస్టులో లేని దేశాల నుంచి వచ్చినా అందరికీ టెస్టులు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రిస్క్ దేశాల నుంచి వచ్చేటోళ్లు 7 రోజులు ఆస్పత్రిలో క్వారంటైన్ పూర్తి చేయాలని, ఇతర దేశాల నుంచి వచ్చినోళ్లకు నెగెటివ్ వచ్చినా 7 రోజులు హోం ఐసోలేషన్ లో ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంటర్నేషనల్​ ఫ్లైట్స్​ ఇప్పట్లో లేనట్టే
ఒమిక్రాన్​ ఆందోళన దృష్ట్యా అంతర్జాతీ య విమాన సర్వీసుల పున:ప్రారంభంపై కేంద్రం వెనక్కి తగ్గింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 23 మార్చి 2020న ఇంటర్నేష నల్​ ఫ్లైట్స్ పై నిషేధం విధించిన కేంద్రం డిసెంబర్​15 నుంచి ప్యాసెంజర్​ సర్వీసుల ను నడిపిస్తామని ఇటీవల ప్రకటించింది. అయితే, ఇప్పుడు చాలా దేశాల్లో కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ వ్యాప్తిపై ఆందోళన నెలకొంది. దీంతో సర్వీసుల ప్రారంభానికి తాత్కాలికంగా బ్రేక్​వేస్తున్నట్లు డైరెక్టరేట్ ​జనరల్ ​ఆఫ్ ​సివిల్​ఏవియేషన్ తెలిపింది. ఇంటర్నేషనల్​సర్వీసులు ఎప్పుడు ప్రారంభించేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.