పెన్షన్​ స్కీమ్​లో కేంద్రానిది అహంకార ధోరణి : ఎస్టీయూ

పెన్షన్​ స్కీమ్​లో కేంద్రానిది అహంకార ధోరణి : ఎస్టీయూ

ఎస్టీయూ మండిపాటు

హైదరాబాద్​, వెలుగు: కాంట్రిబ్యూటరీ పెన్షన్​ స్కీమ్​(సీపీఎస్) నుంచి తిరిగి ​పాత పెన్షన్​విధానం (ఓపీఎస్)లోకి వెళ్లాలనుకొనే రాష్ట్రాలకు పెన్షన్​ ఫండ్​ రెగ్యులేటరీ అండ్​ డెవలప్​మెంట్​అథారిటీ (పీఎఫ్​ఆర్డీఏ)లో జమ చేసిన వాటా సొమ్మును ఇవ్వబోమనడం కేంద్ర ప్రభుత్వ అహంకార, ఎగవేత ధోరణికి నిదర్శనమని స్టేట్​ టీచర్స్​ యూనియన్​(ఎస్టీయూ) మండిపడింది. 

దీని వల్ల 80 లక్షల మంది ఉద్యోగులకు నష్టం జరుగుతుందని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. సదానందం గౌడ్​, యం. పర్వత్​రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో  పేర్కొన్నారు. పీఎఫ్​ఆర్డీఏ చట్టం నిర్బంధ చట్టం కాదని, రాష్ట్రాలు ఎప్పుడైనా సీపీఎస్​ నుంచి ఓపీఎస్​కు మారే వీలుందన్న విషయాన్ని కేంద్రం మరిచిందని ఎస్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి బి. భుజంగరావు విమర్శించారు.