
యూఏఈతో జరుగుతున్న ఆసియా కప్ తొలి మ్యాచ్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ కు చోటు దక్కలేదు. బుధవారం (సెప్టెంబర్ 10) యూఏఈతో ప్రారంభమైన మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ప్లేయింగ్ 11 ప్రకటించగానే అర్షదీప్ సింగ్ జట్టులో లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇండియా తరపున రెండేళ్లుగా నిలకడగా ఆడుతున్న అర్షదీప్ సింగ్ కు ప్లేయింగ్ 11 నుంచి తప్పుంచడానికి కారణం తెలియాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో భారత జట్టు కేవలం ఒక్క స్పెషలిస్ట్ పేసర్ బుమ్రాతో బరిలోకి దిగింది.
స్పిన్ పిచ్ లు కారణంగానే:
దుబాయ్ లోని స్పిన్ ట్రాక్ కారణంగానే అర్షదీప్ సింగ్ పై వేటు పడినట్టు అర్ధమవుతోంది. సహజంగా దుబాయ్ లో స్లో పిచ్ లు ఉంటాయి. దీంతో ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లు అవసరం లేదని టీమిండియా యాజమాన్యం భావించినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ మ్యాచ్ లో ఇండియా ముగ్గురు స్పిన్నర్లలకు ఛాన్స్ ఇచ్చింది. అక్షర్ పటేల్ ఆల్ రౌండర్ గా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో పాటు కుల్దీప్ యాదవ్ కు తుది జట్టులో దక్కింది. శివం దూబే కూడా ఫాస్ట్ బౌలింగ్ వేయగలడు కాబట్టి అర్షదీప్ సింగ్ కు నిరాశ తప్పలేదు.
►ALSO READ | Asia Cup 2025: సెమీ ఫైనల్ లేకుండానే ఆసియా కప్.. టోర్నీ ఫార్మాట్‌పై ఓ లుక్కేయండి
మిడిల్ ఆర్డర్ లో సంజు శాంసన్:
ఆసియా కప్ కు ముందు వరకు సంజు శాంసన్ కు తుది జట్టులో ఛాన్స్ ఉండదని చాలామంది భావించారు. ఓపెనర్ గా గిల్ రావడం.. మిడిల్ ఆర్డర్ లో జితేష్ శర్మ బాగా ఆడడం శాంసన్ కు మైనస్ గా మారాయి. అయితే భారత జట్టు అలాంటి ప్రయోగం ఏమీ చేయలేదు. శాంసన్ కు తుది జట్టులో ఛాన్స్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో సంజు మిడిల్ ఆర్డర్ లో రానున్నట్టు తెలుస్తోంది. ఓపెనర్లుగా గిల్, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నారు. తిలక్ వర్మ, సూర్య వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు.