షూటింగ్లో గుండెపోటు.. ఆర్ట్ డైరెక్టర్ మిలాన్ మృతి

షూటింగ్లో గుండెపోటు.. ఆర్ట్ డైరెక్టర్ మిలాన్ మృతి

తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. గుండెపోటుతో ప్రముఖ కళా దర్శకుడు మిలాన్(Milan) మృతి చెందారు. ప్రస్తుతం ఆయన అజిత్(Ajith) హీరోగా వస్తున్న విదా ముయార్చి(Vida muyarchi)  సినిమా కోసం పని చేస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ అజర్ భైజాన్ లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అస్వస్తతకు గురైన మిలాన్ ను హాస్పిటల్ కు తరలించారు చిత్ర యూనిట్. 

అప్పటికే ఆయన గుండెపోటుతో మృతి చెందారని వైద్యులు తెలిపారు. ఇక మిలాన్ గతంలో అజిత్ హీరోగా వచ్చిన బిల్లా, వేదాళం సినిమాలకు కళా దర్శకుడిగా పనిచేశారు. మిలాన్ హఠాన్మరణంతో తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం ఛాయలు అలుముకున్నాయి. ఈ సందర్బంగా ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.